అచ్చం తాత పోలికే..మోక్షజ్ఞ ని చూస్తే ఎన్టీఆర్ నే మళ్ళీ

Mokshagna Teja Latest Photo: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని బాలకృష్ణ(Nandamuri Balakrishna) నట వారసుడు మోక్షజ్ఞ తేజ(Mokshagna Teja) కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అనేక కారణాల చేత మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం వాయిదా పడుతూ వస్తుంది. ప్రస్తుతం ఆయన వయస్సు 31 ఏళ్ళు. ఇంత వయస్సు వచ్చాక కూడా ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోవడం పై అభిమానుల్లో కాస్త అసహనం ఉంది. ప్రశాంత్ వర్మ తో మొదటి సినిమా షూటింగ్ ని మొదలు పెట్టి ఒక రెండు మూడు రోజులు చేసి మధ్యలో ఆపేసారు. ఎందుకో ఏమిటో కారణాలు తెలియవు కానీ, మళ్ళీ ఈ సినిమా ఎప్పుడు మొదలు అవుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఈ సినిమా కాకుండా, వేరే ఏ సినిమాని అయినా ఆయన చేస్తున్నాడా అంటే దాని గురించి కూడా ఎలాంటి సమాచారం లేదు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఒక పెళ్లి లోని మోక్షజ్ఞ ఫోటో సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read: ఓజీ లో స్పెషల్ క్యామియో రోల్ చేస్తున్న మహేష్ బాబు?

ఆయన లుక్స్ ని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. మోక్షజ్ఞ లుక్స్ ఎలా ఉన్నాయంటే పాత కాలం లో సీనియర్ ఎన్టీఆర్ కి జిరాక్స్ కాపీ లాగా ఉన్నదంటూ, ఇద్దరి ఫోటోలను పోల్చి చూస్తూ ఫ్యాన్స్ వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేస్తోంది. ఎడమ వైపు చూపిస్తున్న ఎన్టీఆర్ ఫోటో పాతాళ భైరవి, మిస్సమ్మ సినిమాల కాలం నాటిది. చక్కని చిరునవ్వుతో కనిపిస్తున్న ఎన్టీఆర్ ఎంత అందంగా ఉన్నాడో మీరే చూడండి. మోక్షజ్ఞ తేజ కూడా అలాంటి లుక్స్ తోనే అదిరిపోయాడని, ఆయన మొదటి సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నామని, ఆలస్యం గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా, దశాబ్దాలు వరకు ఆయన మొదటి సినిమా రికార్డ్స్ గురించి చెప్పుకునేలా ఉంటుందని అంటున్నారు నందమూరి అభిమానులు.

ఇక బాలయ్య ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, ఆయన హీరో గా బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అఖండ 2 – తాండవం’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకుంది. కేవలం ఒకే ఒక్క పాట చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ముందుగా ఈ సినిమాని వచ్చే నెల 25 న దసరా కానుకగా విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ అప్పటికీ సినిమా రెడీ అయ్యే అవకాశమే లేకపోవడం తో డిసెంబర్ నెలకు వాయిదా వేశారు. ఈ చిత్రం తర్వాత బాలయ్య బాబు గోపీచంద్ మలినేని తో ఒక సినిమా చేయబోతున్నాడు. అక్టోబర్ 2 న ఈ చిత్రం మొదలు కానుంది. వీరసింహా రెడ్డి లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండవ సినిమా ఇది.

Leave a Comment