Bigg Boss 9 AgniPariksha Task: టెలివిజన్ రంగంలో అత్యంత పాపులారిటీని సంపాదించుకున్న రియాల్టీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ అనే చెప్పాలి. ఇక ఇప్పటికే బిగ్ బాస్ 8 సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తొమ్మిదో సీజన్ కోసం రంగం సిద్ధం చేసుకుంటుంది. సామాన్య మానవులను సైతం సెలెక్ట్ చేసి వల్ల చేత తాక లను ఆడించి వాళ్లలో కొందరిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడమే లక్ష్యంగా పెట్టుకొని బిగ్ బాస్ యాజమాన్యం ముందుకు సాగుతోంది. మరి ఇలాంటి క్రమంలోనే అగ్ని పరీక్ష ఫోర్త్ ఎపిసోడ్ సైతం టెలికాస్ట్ అయింది. అయితే ఈ ఎపిసోడ్లో జడ్జెస్ అనుసరించిన వైఖరి ఎవరికీ నచ్చడం లేదు. ముఖ్యంగా ప్రియా శెట్టి విషయంలో జడ్జెస్ చాలా వరకు పక్షపాతం చూపించారని చాలామంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…ఇక ఈ ఎపిసోడ్లో ప్రియా శెట్టి దాలియా ఇద్దరు కలిసి బెలూన్ టాస్క్ నైతే ఆడారు. అందులో ఎడమ చేయ్యి వెనక పెట్టుకొని కుడిచేయి తో మాత్రమే ఎదుటి వాళ్ళ బెలూన్ ని పగలగొట్టాల్సి ఉంటుంది.
Also Read: ‘బిగ్ బాస్ 9′ కోసం దేనికైనా రెడీ..’అగ్ని పరీక్ష’ లో సత్తా చాటిన మాస్క్ మ్యాన్, దమ్ము శ్రీజా!
కానీ ప్రియశెట్టి మాత్రం తన ఎడమ చేయి వాడి డాలియా బెలూన్ ను కుడి చేయి తో పగలగొట్టింది. మొత్తానికైతే ప్రియా శెట్టి గెలిచినట్టుగా జడ్జెస్ అనౌన్స్ చేశారు…ఆ వీడియోని కనక మనం పర్టిక్యులర్ గా చూసినట్లయితే ఆమె ఎడమ చేయి ని వాడి దాళియా ను ఆపి కుడి చేయి తో బెలూన్ పగలగొట్టింది అనేది క్లియర్ గా తెలిసిపోతోంది.
మరి ఈ విషయాన్ని తెలిసిన కూడా జడ్జెస్ ఎందుకని ఆ విషయాన్ని దాస్తున్నారు. ప్రియా శెట్టి విషయంలో ఎందుకని వాళ్ళు పక్షపాతం చూపిస్తున్నారు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…ఇక మొత్తానికైతే అగ్ని పరీక్ష నుంచి జడ్జెస్ ఎవర్నయితే బిగ్ బాస్ షోలోకి పంపించాలి అనుకుంటున్నారో వాళ్ళని గెలిపించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారంటూ మరి కొంతమంది బిగ్ బాస్ షో మీద అగ్నిపరీక్ష షో మీద నెగెటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు…
Also Read: దమ్ము శ్రీజా..నిజంగా దమ్మున్న అమ్మాయే..ఓవర్ యాక్షన్ తో రెచ్చిపోయిన నవదీప్!
అగ్నిపరీక్ష షో నుంచి వెళ్లే ఐదుగురు కంటెస్టెంట్లు ఎవరు అనే దానిమీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 45 మందిలో కేవలం ఐదుగురిని మాత్రమే సెలెక్ట్ చేసి బిగ్ బాస్ షోలోకి పంపించడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఇంతకీ ఆ ఐదుగురు ఎవరు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…