Rajinikanth Coolie Movie collections : తమిళనాడులో డిజాస్టర్..తెలుగు రాష్ట్రాల్లో హిట్..’కూలీ’ పరిస్థితి ఇదే!

Rajinikanth Coolie Movie collections : సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ'(Coolie Movie) రీసెంట్ గానే కనీవినీ ఎరుగని రేంజ్ భారీ అంచనాల నడుమ గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ వచ్చింది. సినిమా చూసేందుకు బాగానే ఉన్నప్పటికీ ఈ టాక్ రావడానికి ప్రధాన కారణం హద్దులు దాటిన అంచనాలే అని చెప్పొచ్చు. వరల్డ్ వైడ్ గా పది రోజుల్లో ఈ చిత్రానికి 460 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అయితే వచ్చాయి కానీ, ఫుల్ రన్ లో మాత్రం 500 కోట్ల రూపాయిల గ్రాస్ కి మాత్రమే పరిమితం అయ్యేలా ఉంది. ముఖ్యంగా రెండవ వీకెండ్ లో ఈ చిత్రానికి భారీ వసూళ్లు నమోదు అవుతాయని, దాదాపుగా అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ ఈ రెండవ వీకెండ్ తో అవుతుందని అనుకున్నారు. కానీ అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కు కి చాలా దగ్గరగా వచ్చింది. ఫుల్ రన్ ముగిసే సమయానికి బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా దాటుకొని సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకోవచ్చు. కానీ తమిళనాడు లో మాత్రం ఈ చిత్రం ఫ్లాప్ కి డిజాస్టర్ ఫ్లాప్ కి మధ్యలో ఉంది. ఈ చిత్రాన్ని తమిళనాడు లో బయ్యర్స్ 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే షేర్ కేవలం 60 కోట్ల రేంజ్ లోనే ఉంటుంది. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 120 కోట్లు షేర్ వసూళ్లు రావాలి. అంటే బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఈ చిత్రం మరో 60 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 130 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను ఈ చిత్ర రాబట్టాలి.

అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. దీంతో రజినీకాంత్ ఖాతాలో తమిళనాడు లో డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ సినిమా కేవలం ఈ ఒక్క ప్రాంతం లోనే ఎందుకు డిజాస్టర్ అయ్యింది అనేది చూడాలి. రజినీకాంత్ కి తమిళనాడు లో సినిమా సినిమాకు క్రేజ్ తగ్గుతూ వస్తుంది. ఒకప్పుడు రజినీకాంత్ సినిమా వస్తే చాలు,బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు అనే రేంజ్ లో ఉండేది. టాక్ తో సంబంధం లేకుండా ఇండస్ట్రీ రికార్డ్స్ నిబద్దలు కొట్టిన చరిత్ర ఆయనది, అలాంటి ఆయనకు మినిమమ్ రేంజ్ గ్యారంటీ కంటెంట్ సినిమా తగిలినా కూడా తమిళనాడు ప్రాంతం లో డిజాస్టర్ ఫలితం ఇవ్వడం గమనించాల్సిన విషయం.

[

Leave a Comment