Jagan And Chandrababu: చంద్రబాబు( AP CM Chandrababu) అపర మేధావి. ఎలాంటి పరిస్థితులు నైనా తట్టుకోగలరు. ప్రతికూల పరిస్థితులను సైతం అధిగమించగలరు. అపజయం ఎదురైందని కృంగిపోరు. విజయం దక్కిందని విరుచుకుపడరు. గెలుపోటములను సమానంగా తీసుకునే నాయకుడు. అందుకే ఆయన ఈ సక్సెస్ను సాధించారు. 2004లో టిడిపి అధికారం కోల్పోయింది. 2009లో సైతం రెండోసారి పరాజయం చవిచూసింది. ఇక ఆ పార్టీ పని అయిపోయిందని అంతా భావించారు. కానీ 2014లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. 2019లో అయితే ఘోర పరాజయం ఎదురైంది. ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న చంద్రబాబు ఒకానొక దశలో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురైన పరాభవాన్ని తట్టుకోలేక పోయారు. ఏకంగా రోదించారు. కానీ ఆ రోదన నుంచి పుట్టుకొచ్చిన పట్టుదలతో.. రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి 2024లో ఘన విజయం సాధించారు. కానీ చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డికి అనుభవం తక్కువ. ఇప్పుడు కూడా చంద్రబాబును తక్కువగా ఆలోచన చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. 2029 మనదేనని చెబుతున్నారు.
Also Read: ఈ కానిస్టేబుల్ నిత్య పెళ్లికొడుకు.. చివరకు 13 ఏళ్ల బాలికను కూడా వదలలేదు!
* సోషల్ మీడియాను నమ్ముకున్న జగన్..
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ఎప్పుడు సోషల్ మీడియా ప్రచారాన్ని వాడుకుంటారు. ఇప్పుడు కూడా ఆయన చేస్తోంది అదే. అమరావతి మునిగిపోయిందని.. వికలాంగుల పింఛన్లు తొలగిస్తున్నారని.. పథకాలు అమలు చేయడం లేదని.. రాష్ట్రంలో పాలన ఘోరంగా ఉందని.. శాంతిభద్రతలకు తీరని విఘాతం కలుగుతోందని.. ఇలా చాలా రకాల ఆరోపణలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ పార్టీ తరఫున ప్రచారం చేస్తూనే ఉన్నారు. కేవలం సోషల్ మీడియా ప్రచారాన్ని మాత్రమే నమ్ముకుంటున్నారు. కానీ దానిని ఎలా తిప్పి కొట్టాలో చంద్రబాబుకు తెలుసు. ప్రస్తుతం చంద్రబాబు చేస్తోంది అదే. ఒక్కమాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో ఎలా చులకన చేయాలో ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారు చంద్రబాబు. దానిని గ్రహించలేకపోతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* ప్రజలకు అన్నీ వివరిస్తున్న చంద్రబాబు
సోషల్ మీడియాలో( social media) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారానికి చెక్ చెప్పేందుకు చంద్రబాబు భావిస్తున్నారు. ఒకవైపు అమరావతి రాజధాని నిర్మాణ పనులను శరవేగంగా జరిపిస్తున్నారు. వచ్చే నెలలో ప్రధాని మోదీని తెప్పించి అమరావతిలోని ఐకానిక్ భవన నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. దానికి మోడీ శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నట్లు ఆధారాలతో సహా చూపించగలుగుతున్నారు. ఇంకోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వంటివి ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా అమలు చేయగలుగుతున్నారు. దీంతో ప్రజల్లో కూడా ఒక రకమైన సంతృప్తి కనిపిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాలను ఒక పద్ధతి ప్రకారం తిప్పి కొడుతున్నారు. మునిగిపోయింది అమరావతి కాదని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని తేల్చి చెబుతున్నారు. ఇవి ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. కానీ వీటిని గుర్తించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు సీనియారిటీ, జగన్మోహన్ రెడ్డి అనుభవ లేమి వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి.