Diabetes: బెండకాయతో బోలెడు లాభాలు | Eating ladies finger keep diabetes under control sn-10TV Telugu

బెండకాయ భారతీయ వంటకాలలో సాధారణంగా కనిపించే ఒక ఆరోగ్యకరమైన(Diabetes) కూరగాయ. చాలా మందికి ఇది రోజూవారి ఆహారంలో భాగంగా ఉంటుంది.

Diabetes: బెండకాయతో బోలెడు లాభాలు | Eating ladies finger keep diabetes under control sn-10TV Telugu

Eating ladies finger keep diabetes under control

Updated On : August 23, 2025 / 6:10 PM IST

Diabetes: బెండకాయ భారతీయ వంటకాలలో సాధారణంగా కనిపించే ఒక ఆరోగ్యకరమైన కూరగాయ. చాలా మందికి ఇది రోజూవారి ఆహారంలో భాగంగా ఉంటుంది. ఇది సాధారణ ఆహార పదార్థంగా మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలిగించగల శక్తివంతమైన ఔషధ గుణాలు కలిగిన కూరగాయగా పరిగణించబడుతోంది. ప్రత్యేకంగా మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారికి బెండకాయ ఒక అద్భుతమైన ఔషధంగా చెప్పుకోవచ్చు. మరి బెండకాయ మధుమేహాన్ని(Diabetes) ఎలా నియంత్రించగలదో, దానిని ఎలా తీసుకోవాలి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Green Peas: పచ్చి బఠాణి చాలా ప్రత్యేకం.. గుండె సమస్యలు, షుగర్ వ్యాధికి దివ్యౌషధం.. రోజు తింటే ఎన్ని లాభాలో

1.బెండకాయలో ఉన్న శక్తివంతమైన పోషకాలు:

  • డైటరీ ఫైబర్: బ్లడ్ షుగర్‌ను ఒక్కసారిగా పెరగకుండా అడ్డుకుంటుంది.
  • పాలీసాక్కరైడ్లు, ఫ్లేవనాయిడ్లు: యాంటీ డయాబెటిక్ గుణాలు కలిగి ఉంటాయి
  • విటమిన్ C, K, A & B6
  • ఫోలేట్, మెగ్నీషియం, కాల్షియం

2. మధుమేహంపై బెండకాయ ప్రభావం:

బ్లడ్ షుగర్ స్థాయులను నియంత్రిస్తుంది:
బెండకాయలో ఉన్న ఫైబర్ బ్లడ్‌లో గ్లూకోజ్ శోషణను నెమ్మది చేస్తుంది. భోజనం తర్వాత బ్లడ్ షుగర్ సడెన్‌గా పెరగకుండా నియంత్రణలో ఉంచుతుంది.

ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరచుతుంది:
కొన్ని అధ్యయనాల ప్రకారం, బెండకాయలోని సహజమైన సమ్మేళనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌ను సమర్థంగా వినియోగించేందుకు సహాయపడుతుంది.

యాంటీఆక్సిడెంట్ లక్షణాలు:
బెండకాయలో యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల ప్యాంక్రియాస్ క్షీణించకుండా ఉండేలా చేస్తుంది.

3.బెండకాయను మధుమేహ చికిత్సలో ఎలా ఉపయోగించాలి?

1.బెండకాయ నీళ్లు:
2 నుంచి 3 బెండకాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. రాత్రి గ్లాస్ నీటిలో వేసి నానబెట్టాలి. ఆ నీటిని ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి. దీన్ని వారానికి 4 నుంచి 5 రోజులు తాగడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.

2.వంటలో చేర్చడం:
బెండకాయ పచ్చడి, ఫ్రై, కూర వంటలుగా రెగ్యులర్ డైట్‌లో తీసుకోవచ్చు. కాకపోతే నూనె, ఉప్పు, కారం వాడకం నియంత్రణలో ఉంచుకోవాలి

జాగ్రత్తలు:

  • మధుమేహ నివారణలో బెండకాయ ఉపయోగపడుతుంది కానీ, ఇదే వైద్యం కాదు
  • డాక్టర్ సూచించిన మందులతో పాటు సహాయకంగా మాత్రమే తీసుకోవాలి
  • కొన్ని మందులతో కలిపి బెండకాయను తీసుకుంటే షుగర్ స్థాయిలు ఎక్కువగా తగ్గే ప్రమాదం ఉంది
  • అధిక మొత్తంలో తీసుకోవడం మలబద్ధకం సమస్య రావచ్చు

[

Leave a Comment