మహేష్ బాబు కి హిట్ ఇచ్చిన ఆ డైరెక్టరే రమేష్ బాబు

Ramesh Babu Son: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ కి చాలా మంచి ఇమేజ్ ఉండేది. ఆయన మాస్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవర్గ్రీన్ హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే తన నట వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు సైతం స్టార్ హీరోగా అవతరించడమే కాకుండా సూపర్ స్టార్ రేంజ్ ను టచ్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక మహేష్ బాబు కంటే ముందే రమేష్ బాబు ఇండస్ట్రీకి వచ్చినప్పటికి ఆయన చేసిన సినిమాలు అతనికి ఏ మాత్రం సక్సెస్ ను సంపాదించి పెట్టకపోవడంతో ఆయన ఇండస్ట్రీ నుంచి ఫెడౌట్ అయిపోయాడు. ఇక ప్రస్తుతం రమేష్ బాబు కొడుకు అయిన జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగ సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఆయనకు చాలామంది స్టార్ డైరెక్టర్లు సైతం కథలను వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మహేష్ బాబు తో ‘సర్కార్ వారి పాట’ అనే సినిమా చేసిన పరుశురాం జయకృష్ణ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. యూత్ ను అట్రాక్ట్ చేసే కథతో ఆయన జయకృష్ణతో సినిమా చేయబోతున్నాడట. అయితే పరుశురాం స్టైల్ డిఫరెంట్ యాంగిల్ లో ఉంటుంది. ఆయన మాస్ సన్నివేశాలను సక్సెస్ ఫుట్ గా ఎలివేట్ చేస్తూనే ఆయా హీరోలకు ఒక స్టార్ డమ్ ను కట్టబెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు.

Also Read: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు..నార్త్ అమెరికా లో ఫైర్ స్ట్రోమ్!

మరి పరుశురాం చెప్పిన కథకి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తొందర్లోనే వీళ్ళ కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. జయకృష్ణకు సంబంధించిన సినిమా ఇంట్రడక్షన్ పనులు మొత్తాన్ని మహేష్ బాబు చూసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తే ఆయన స్టార్ హీరోగా ఎదుగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి మహేష్ బాబు బాటలోనే నడుస్తూ తనదైన రీతిలో తన స్టార్ డమ్ ను విస్తరించుకోవాలనే ప్రయత్నం అయితే జయకృష్ణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది…

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు ఒక్కడే ఇప్పుడు స్టార్ హీరోగా ఉన్నాడు.ఇక మెగా, నందమూరి, అక్కినేని ఫ్యామిలాల నుంచి చాలా మంది హీరోలు ఉన్నారు. దానివల్ల కూడా మహేష్ బాబు తన కుటుంబ సభ్యులను హీరోలుగా మార్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది…

Leave a Comment