ఆరేళ్ల కిందటి అదానీ ప్రాజెక్ట్.. కొత్తగా 2,400 ఎకరాలు.. అసలేంటి కథ!?

Adani Solar Power Project AP

Adani Solar Power Project AP: ఏపీలో( Andhra Pradesh) పరిశ్రమల ఏర్పాటు పై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తోంది. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పరచాలని భావిస్తోంది. అందుకే పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి పెద్ద ఎత్తున భూములను కేటాయిస్తోంది. తాజాగా ఆదానీ సంస్థ సోలార్ విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి భారీగా భూ కేటాయింపులు చేస్తూ రెవెన్యూ శాఖ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. కడప జిల్లాలో 2400 ఎకరాల ప్రభుత్వ భూమిని 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Also Read: ఈ కానిస్టేబుల్ నిత్య పెళ్లికొడుకు.. చివరకు 13 ఏళ్ల బాలికను కూడా వదలలేదు!

* ఆ రెండు గ్రామాల పరిధిలో..
కడప జిల్లా( Kadapa district) మైలవరం మండలం ధోడియం, వడ్డిరాల గ్రామాల్లో 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చెయ్యాలని అదానీ భావించింది. 2016లో టిడిపి ప్రభుత్వ హయాంలోనే ఈ 2400 ఎకరాల ప్రభుత్వ భూములకు ముందస్తు పొజిషన్ కింద ఇచ్చింది. 2019లోనే ఈ ప్రాజెక్టు పూర్తయింది. అయితే ఇప్పుడు మరో 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన ఆ భూమి కేటాయిస్తున్నట్లుగా సర్కారు ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. 2019 నాటి మార్కెట్ విలువ ఆధారంగా.. పది శాతం లీజు ఫీజు ఉంటుందని పేర్కొంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి లీజు ఫీజు పది శాతం పెరుగుతుందని స్పష్టం చేసింది. అయితే దీనిపై రకరకాల చర్చ నడుస్తోంది.

* పదేళ్లలో కదలిక లేదు..
అయితే గత పది ఏళ్లలో భూమి కేటాయింపు విషయంలో కదలిక లేదు. ఇప్పుడే ఎందుకు ఉత్తర్వు ఇచ్చారనేది హాట్ టాపిక్ గా మారుతుంది. దీనిపై రెవెన్యూ శాఖ( Revenue Department) సైతం స్పష్టత ఇవ్వకపోవడం సందేహాలను రేకెత్తిస్తోంది. దోడియంలో 2305.74 ఎకరాలు, వడ్డిరాలలో 94.36 ఎకరాలు భూములను కేటాయించారు. 2019 నాటికి ఈ సోలార్ ప్రాజెక్టు పూర్తయింది. కానీ వైసీపీ హయాంలో భూ కేటాయింపు ఉత్తర్వులు ఇవ్వలేదు. ఇదే విషయాన్ని ఇటీవల కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు లీజును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దోడియం లో ఎకరాకు మూడు లక్షలు, వడ్డిరాలలో ఎకరం 6.25 లక్షలు గా ఖరారు చేశారు. దీనిపై రెవెన్యూ శాఖ మరింత స్పష్టతనిస్తే బాగుంటుంది.

[

Leave a Comment