– Advertisement –
న్యూఢిల్లీ: కొన్ని మినహాయింపులతో అ మెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలను భారత్ నిలిపివేసింది. 25వ తేదీ నుంచి అంటే రేపటి నుంచే ఇది అమల్లోకి వ స్తుందని పోస్టల్ విభాగం ప్రకటించింది. అయితే సేవల నిలిపివేత తాత్కాలిక మేన ని శనివారంనాడు విడుదల చేసిన ఓక ప్ర కటనలో తెలిపింది. భారత్‌పై పలు రకాల సుంకాల విధింపు ఆదేశాలను అమెరికా ఈ నెల 27 నుంచి అమలులోకి తీసుకువస్తుండడం, అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ వద్ద కచ్చితమైన మార్గదర్శకాలు లేకపోవడం తాజా నిర్ణయానికి కారణమైంది. 800 డాలర్ల వరకూ విలువ చేసే సరుకులపై ఇప్పుడు ఉన్న డ్యూటీ ఫ్రీ మినిమ్స్ రద్దు చేస్తూ జులై 30న అమెరికా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
100 డాలర్ల వరకూ విలువచేసే లెటర్స్, డాక్యుమెంట్లు, కానుకలు సుంకాల నుంచి మినహాయింపు కొనసాగుతుందని ప్రకటించింది. ఇక అంతకుమించి విలువ గలిగిన ఏ వస్తువులు కూడా ఇక అమెరికాకు పోస్టు ద్వారా టారిఫ్‌ల భారం లేకుండా వెళ్లేందుకు వీలుండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆగస్టు 25 తర్వాత వచ్చే పోస్టల్ కన్‌సైన్‌మెంట్లను స్వీకరించలేమని అమెరికా విమానాయాన సంస్థలు కూడా వెల్లడించాయి. ఇప్పటికే బుకింగ్ జరిగిన వాటికి రీఫండ్ ఉంటుందని, తిరిగి సేవల పునరుద్ధరణకు కృషి చేస్తున్నట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి.ఆగస్టు 27 నుంచి టారిఫ్‌లు అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ సమయంలో గడువు పొడిగింపు లాంటింది ఉంటుందని అనుకోవడం లేదని శ్వేతసౌధం వాణిజ్య సలహాదారు పీటర్ నరావో అభిప్రాయపడ్డారు
– Advertisement –