ABN RK Land Allotment: ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణకు కోట్ల స్థలం.. చివరి నిమిషంలో దూరమైందిలా..

ABN RK Land Allotment: కూటమికి ముఖ్యంగా టిడిపికి వేమూరి రాధాకృష్ణకు చెందిన ఆంధ్ర జ్యోతి అనుకూలంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా గడచిన ఎన్నికల సమయంలో ఆంధ్రజ్యోతి టిడిపికి అనుకూలంగా వార్తలు రాసింది. కొన్ని సందర్భాల్లో టిడిపి నాయకులు చేయలేని పని కూడా ఆంధ్రజ్యోతి చేసింది. అందువల్లే ఆంధ్రజ్యోతిని టిడిపి నాయకులు తమ సొంత పత్రిక అనుభవిస్తుంటారు.

Also Read: కూకట్ పల్లి బాలిక హత్య కేసు.. వీడు మామూలోడు కాదు.. పోలీసులకే దిమ్మతిరిగిపోయింది

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. సహజంగానే ఆంధ్రజ్యోతికి మేళ్లు జరిగిపోతున్నాయి. ఫుల్ పేజీ యాడ్స్ వచ్చేస్తున్నాయి.. అంతేకాదు ఆంధ్రజ్యోతి పత్రిక యజమాని వేమూరి రాధాకృష్ణకు సంబంధించిన హైడెల్ పవర్ ప్రాజెక్టు తో ఏపీ జెన్కో కరెంటు కొనడానికి ఒప్పందం కూడా కుదిరింది. అయితే ఇప్పుడు తాజాగా వేమూరి రాధాకృష్ణకు విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో స్థలం కేటాయించడానికి రంగం సిద్ధమైంది. అయితే చివరి నిమిషంలో ఇది దూరమైంది.

విశాఖపట్నం నగరంలోని ఆంధ్రజ్యోతి పత్రికలు ఆరా ఎకరం హౌసింగ్ బోర్డు స్థలాన్ని విశాఖపట్నం నగరపాలక సంఘం ద్వారా కేటాయించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్థలాన్ని నామమాత్రపు ధరకు కేటాయించాలని ప్రభుత్వం భావించింది. అయితే అంతటి ఖరీదైన స్థలాన్ని తక్కువ ధరకు ఎలా ఇస్తారని వైసీపీ నేతలు ప్రశ్నించారు. అంతేకాదు ఈ అంశాన్ని వాయిదా వేసుకున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీనివాసరావు ప్రకటించడంతో.. భూమి కేటాయింపు వాయిదా పడింది.

విశాఖపట్నం నగరంలోని పరదేశి పాలెం లోని సర్వే నెంబర్ 203/2 పీ లో అర ఎకరం స్థలం ఉంది. ఈ స్థలాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించే ఆమోద పబ్లికేషన్స్ కు కేటాయించే విషయం విశాఖపట్నం మహానగర పాలక సంస్థ కౌన్సిల్ ముందుకు వచ్చింది.. అయితే ఈ స్థల కేటాయింపు విషయాన్ని రెగ్యులర్ అజెండాలో చేర్చలేదు. కేవలం టేబుల్ అజెండాలో మాత్రమే చేర్చారు. ఈ విషయాన్ని నాలుగైదు రోజుల ముందుగా కార్పొరేటర్లకు చెప్పాల్సి ఉండగా.. దాన్ని చెప్పకుండా గోప్యతను పాటించారు. టేబుల్ అజెండాలో 67వ అంశంగా చివరి నిమిషంలో దీనిని కౌన్సిల్ ముందుకు తేవడం అనుమానాలకు తావిస్తోంది.. ఇంతటి అంశాన్ని టేబుల్ ఎజెండాగా ఎలా చేర్చుతారని వైసీపీ నేతలు ప్రశ్నించారు. దీంతో ఆ అంశాన్ని వాయిదా వేస్తున్నట్టు శ్రీనివాసరావు ప్రకటించారు. ఇక్కడ ఎకరం విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 20 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక 2017లో ఇదే ప్రాంతంలో 7.26 కోట్లు విలువ చేస్తే స్థలాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 50.50 లక్షలకే టిడిపి ప్రభుత్వం ఆంధ్రజ్యోతి పత్రికకు కేటాయించింది. అయితే దానిని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసింది. అంతేకాదు ఆ స్థలాన్ని పేదలకు పంచాలని నిర్ణయించింది.

Leave a Comment