సహాయ కార్యదర్శులుగా తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఇ.టి.నర్సింహ
కామ్రేడ్ పొట్లూరి నాగేశ్వర రావు నగర్
(గాజుల రామారం) : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు వరుసగా రెండవ సారి ఎన్నికయ్యారు. అలాగే రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఇ.టి.నర్సింహా ఎన్నికయ్యారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ‘కామ్రేడ్ పొట్లూరి నాగేశ్వర రావు నగర్’(గాజుల రామారం)లో జరిగిన సీపీఐ రాష్ట్ర నాలుగవ మహసభ చివరి రోజు శుక్రవారం నూతన నాయకత్వాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. పది మంది కార్యదర్శివర్గ సభ్యులు, 32 మంది కార్యవర్గ సభ్యులు సహా మొత్తం 101 మందితో నూతన రాష్ట్ర సమితి ఎన్నికైంది. రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని పేరును సీపీఐ సీనియర్ నాయకులు పల్లా వెంకట్‌రెడ్డి ప్రతిపాదించగా, కలవేన శంకర్ బలపర్చారు. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర సమితి ఏక్రగీవంగా ఆమోదం తెలియజేసింది. అలాగే రాష్ట్ర సమితికి క్యాండి డేట్ సభ్యులు, ఆహ్వానితులను, రాష్ట్ర కార్యవర్గానికి ఆహ్వానితులను కూడా ఎన్నుకున్నారు. నూతన నాయకత్వాన్ని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా అభినందించారు. రాష్ట్రంలో సీపీఐని మరింత బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని వారికి దిశానిర్దేశం చేశారు.
సీపీఐ నూతన రాష్ట్ర సమితి సభ్యులు :
కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట రెడ్డి, పశ్య పద్మ, పల్లా వెంకట్‌రెడ్డి, తక్కళ్లపల్లి శ్రీనివాస రావు, బాగం హేమంతరావు, కలవేణ శంకర్, ఎం.బాలనరసింహా, ఇ.టి.నరసింహా, వీఎస్.బోస్, ఎన్.జ్యోతి, వి.సృజన, ఎస్.బాల్‌రాజ్, ఎం.డి.యూసుఫ్, కలకొండ కాంతయ్య, సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రీ, కె.ధర్మేంద్ర, కె.మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్, వి.సీతారామయ్య, బొమ్మగాని ప్రభాకర్, బి.ఎస్.ఆర్.మోహన్‌రెడ్డి, ఎన్.మధుకర్, రమావత్ అంజయ్య నాయక్, పల్లె నర్సింహా, కె.శ్రీనివాస్ రెడ్డి, కె.ధనుంజయనాయుడు, మారపాక అనిల్‌కుమార్.