భార్యతో ఏకాంతంగా గడిపేందుకు బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన భర్త.. కాసేపటికే గట్టిగా కేకలు..

భార్యతో ఏకాంతంగా గడిపేందుకు బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన భర్త.. కాసేపటికే గట్టిగా కేకలు..

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. వివాహం అయిన 4 నెలలకే ఒక భర్త తన భార్యపై తీవ్రమైన నేర ఆరోపణలు చేస్తూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పెళ్లైన రాత్రి నుండి తన భార్య తనతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదని.. తాను భార్యతో ప్రేమగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే, ఆమె ఏవో ఒక సాకులు చెబుతూ వెళ్లిపోతుందని చెప్పుకొచ్చాడు. తాను ఒకసారి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు, భార్య తన ప్రైవేట్ పార్ట్‌పై దాడి చేసింది. దీని కారణంగా, తనకు 7 కుట్లు పడ్డాయని తెలిపాడు. అతని మాటలు విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన బిజ్నోర్‌లోని మండవర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. ఇక్కడ సిమ్లా కాలా గ్రామానికి చెందిన చంద్ వీర్ సింగ్ అలియాస్ చంద్ అనే వ్యక్తికి 2025 ఏప్రిల్ 29న అలీపురా జాట్ కొత్వాలి దేహత్ ప్రాంతానికి చెందిన తనును అనే యువతితో వివాహం జరిగింది. అయితే పెళ్లైన నాటి నుంచి తనును తనతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదని వీర్‌సింగ్‌ ఆరోపిస్తున్నాడు. తనతో ప్రేమగా మాట్లాడుదామన్న ప్రతి సారి ఆమె ఇంటి పని సాకు చెపుతూ గది నుండి బయటకు వెళ్లేదని అతను చెప్పుకొచ్చాడు. తరచుగా ఆమె ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడటంలో బిజీగా ఉంటుందని, తాను వచ్చిన వెంటనే, ఆమె ఫోన్ డిస్‌కనెక్ట్ చేస్తుందని ఆతను ఆరోపించాడు.

ఆగస్టు 20న సాయంత్రం 6 గంటల సమయంతో తాను భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ఆమెకు కోపం వచ్చిందని.. దీంతో ఆమె తన ప్రైవేట్ పార్ట్‌పై బ్లేడుతో దాడి చేసిందని వీర్‌సింగ్‌ ఆరోపించాడు. తన కేకలు, కేకలు విని ఇంట్లోని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా బెడ్‌రూమ్‌లోకి చేరుకున్నారని.. రక్తపు మడుగుల్లో ఉన్న తనను వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ తన ప్రైవేట్ పార్ట్‌పై ఏడు కుట్లు వేసి తన ప్రాణాన్ని కాపాడారని అతను చెప్పుకొచ్చాడు.

భార్య కూడా తీవ్రమైన ఆరోపణలు చేసింది.

చంద్‌వీర్ సింగ్ ఫిర్యాదు మేరకు అతని భార్యపై పోలీసులు పలు సెక్షన్‌ల కింద కేసు నమెదు చేసి చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై మండవర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్ సరోజ్ మాట్లాడుతూ.. చంద్‌వీర్ సింగ్ భార్య కూడా అతనిపై కీలక ఆరోపణలు చేసిందన్నారు. తనకు కొత్తగా పెళ్లయిందని.. తాను తన తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడినప్పుడల్లా, ఆమె భర్త చంద్‌వీర్ ఆమెను వేరే అబ్బాయితో మాట్లాడుతున్నాడని అనుమానించేవాడని ఆమె చెప్పినట్టు తెలిపాడు. అలాగే, అతను ప్రతిరోజూ ఆమెతో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకునేవాడని, దీని కారణంగా ఆమె చాలా నొప్పి, ఇబ్బందిని ఎదుర్కొంటోంటున్న చెప్పిందని తెలిపారు. అదే కోపంతో ఆమె అతనుపై దాడి చేశానని చెప్పినట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Comment