'జల్సా' రీ రిలీజ్ ఈసారి సక్సెస్ అవ్వడం కష్టమే..ఎందుకంటే!

Jalsa Re Release

Jalsa Re Release: కారణం ఏంటో తెలియదు కాదు, ఈమధ్య కాలంలో మన టాలీవుడ్ లో రీ రిలీజ్ చిత్రాలకు ఆదరణ బాగా తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. ‘ఖలేజా’ చిత్రం చివరగా విజయవంతమైన రీ రిలీజ్ చిత్రం. ఆ తర్వాత మహేష్ పుట్టినరోజు నాడు విడుదలైన ‘అతడు’, నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా విడుదలైన ‘స్టాలిన్’ చిత్రాలు మిశ్రమ ఫలితాలను సొంతం చేసుకున్నాయి. స్టాలిన్ చిత్రం గతం లో సూపర్ హిట్ ఏమి కాదు, అదే విధంగా కాలం గడిచే కొద్దీ ఆ సినిమాకు క్లాసిక్ స్టేటస్ కూడా రాలేదు. అలాంటి సినిమాకు రీ రిలీజ్ లో మిశ్రమ స్పందన రావడం సహజమే. అలాంటి స్పందనే వస్తుందని అంతా ఊహించారు కూడా. కానీ ‘అతడు’ చిత్రానికి మాత్రం అంతటి మిశ్రమ స్పందన వస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. రీ రిలీజ్ హిస్టరీ లోనే ఎవ్వరూ ముట్టుకోలేంత రికార్డుని ఈ సినిమా నెలకొల్పుతుందని ఫ్యాన్స్ విడుదలకు ముందు బలంగా నమ్మారు.

Also Read: ‘ఓజీ’ షూటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదా..? అభిమానుల్లో మొదలైన టెన్షన్!

ఎందుకంటే ‘అతడు’ చిత్రానికి ఆడియన్స్ లో కల్ట్ క్లాసిక్ అనే పేరుంది. కేవలం మహేష్ అభిమానులకు మాత్రమే కాదు, టాలీవుడ్ అందరి హీరోల అభిమానులకు ఈ సినిమా అంటే ఎంతో ఇష్టం, అలాంటి సినిమాకే మిశ్రమ స్పందన వచ్చిందంటే రీ రిలీజ్ ట్రెండ్ ముగిసినట్టే అనుకోవాలి. ఇకపోతే సెప్టెంబర్ 2 న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా ‘జల్సా'(Jalsa Movie) చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. మరో నెల రోజుల్లో ఓజీ చిత్రం విడుదల పెట్టుకొని, ఇప్పుడు రీ రిలీజ్ ఏంటి?, మేము ఈసారి అసలు సహకరించము అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో మండిపడ్డారు. తక్షణమే ఈ సినిమాని ఆపేయాలంటూ నిర్మాతలు ట్యాగ్ చేసి మరీ రిక్వెస్ట్ చేశారు. కానీ ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఈ సినిమాని పవర్ స్టార్ పుట్టినరోజు కి విడుదల చేసి తీరుతాం అనే మోడ్ లోనే ఉన్నారు నిర్మాతలు.

Also Read:  ఓజీ vs అఖండ 2 పోటీలో వెనక్కి తగ్గిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

ఇప్పుడు ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. అయితే ఈ రీ రిలీజ్ కూడా ఫ్లాప్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే పవన్ ఫ్యాన్స్ ఆసక్తి చూపించడం లేదు అనేది ఒక కారణమైతే, రీ రిలీజ్ ట్రెండ్ ముగిసిపోయింది అనేది మరో కారణం. ఇదంతా పక్కన పెడితే జల్సా చిత్రం రీ రిలీజ్ అవ్వడం ఇది కొత్త కాదు. రెండేళ్ల క్రితం ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా స్పెషల్ షోస్ ని ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ షోస్ నుండి ఈ చిత్రానికి 3 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది అప్పట్లో ఆల్ టైం ఇండియన్ రికార్డు గా నిల్చింది. మళ్ళీ అదే సినిమా రీ రిలీజ్ అంటే మామూలు ఆడియన్స్ కూడా ఆసక్తి చూపించరని అంటున్నారు విశ్లేషకులు.

Leave a Comment