Suravaram Sudhakar Reddy: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి కన్నుమూత – Telugu News | CPI Leader Suravaram Sudhakar Reddy Passes away In Hyderabad

సీపీఐ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌ రెడ్డి (83) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే   శుక్రవారం (ఆగస్టు 22) రాత్రి పరిస్థితి విషమించడంతో సురవరం తుదిశ్వాస విడిచారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న సుధాకర్ రెడ్డి జన్మించారు. 1998, 2004లో జరిగిన ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2012 నుంచి 2019వరకు ఆయన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవిలో కొనసాగారు. సురవరం సుధాకర్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధుడు.  తెలంగాణ సాయుధ పోరాటంలోనూ ఆయన పాల్గొన్నారు. సుధాకర్‌రెడ్డి  కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుంచి బీఏ చేశారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ పట్టాపొందారు. ఇక సుధాకర్ రెడ్డి 1974లో విజయలక్ష్మిని వివాహం చేసున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సుధాకర్ రెడ్డి మరణంతో కమ్యూనిస్టులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మరణానికి తీవ్ర సంతాపం తెలుపుతున్నారు.

Leave a Comment