Kuppam Daggadarthi Airport: ఏపీలో( Andhra Pradesh) కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణంపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం, నెల్లూరు జిల్లా దగదర్తిలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. ఆ రెండు విమానాశ్రయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలో అభివృద్ధి చేస్తారు. దీనికి సంబంధించిన ముసాయిదా ఆర్ఎఫ్పిని క్యాబినెట్ ఆమోదించింది. భూ సేకరణతో పాటు యుటిలిటీల బదిలీ కోసం హడ్కో నుంచి రుణం తీసుకోనున్నారు. ఎయిర్పోర్ట్ కు కావలసిన మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తారు. దీనికి మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ప్రతిపాదనలు చేయగా ఏపీ క్యాబినెట్ ఆమోదించింది.
Also Read: Sharmila Meeting Jagan: జగన్ తో షర్మిల భేటీ?
రోల్ మోడల్ గా కుప్పం..
కుప్పం నియోజకవర్గాన్ని( Kuppam constitution ) రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు ప్రణాళిక. ఇదే నియోజకవర్గానికి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన చంద్రబాబు.. ఏమి చేయలేకపోయారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ వచ్చింది. దానికి చెక్ చెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే కుప్పంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం. వాస్తవానికి 2019 జనవరిలోనే శంకుస్థాపన జరిగింది. పనులు మాత్రం ముందుకు సాగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో చంద్రబాబు ఈ విషయంపై దృష్టి పెట్టారు. ఇక్కడ విమానాశ్రయం కోసం 1200 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. నాలుగు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి.. ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను మొదలు పెట్టాలని గట్టి సంకల్పంతో ఉన్నారు.
నెల్లూరు జిల్లా దగదర్తి లో..
నెల్లూరు జిల్లా దగదర్తిలో( dhaagadharti) ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలన్నది దశాబ్దాల కల. ఇప్పుడు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. భూమిని సేకరించే పని దాదాపు పూర్తయింది. తాజాగా క్యాబినెట్లో సైతం ఆమోదం తెలిపారు. ప్రస్తుతం భూ సేకరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. క్యాబినెట్ ఆమోదించడంతో ఆ పని మరింత వేగవంతం కానుంది. కోర్టు కేసులు కూడా పరిష్కారమయ్యాయి. త్వరగా భూసేకరణ పూర్తి చేసి రైతులకు నష్టపరిహారం ఇస్తామని అధికారులు చెబుతున్నారు.
Also Read: కుప్పంలో విద్యార్థులతో చెత్త పనులు.. వీడియోతో అడ్డంగా బుక్
అంతర్జాతీయ విమానాశ్రయం..
మరోవైపు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ( International Airport) నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి విమాన రాకపోకలు సాగించే వీలుగా పనులు జరిపిస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇంకోవైపు శ్రీకాకుళం జిల్లాలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. తాడేపల్లిగూడెం, పల్నాడు జిల్లా నాగార్జునసాగర్, తుని- అన్నవరం, ప్రకాశం జిల్లా ఒంగోలులో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.