కొడుకు సక్సెస్ కాలేకపోయినా.. కూతురు సచిన్ ను

Sara Pilates Academy: సచిన్ కంటే ఎత్తుంటాడు. బౌలింగ్ కూడా వైవిధ్యంగా చేస్తాడు. అన్నీ ఉన్నప్పటికీ అల్లుడు నోట్లో శని అన్నట్టుగా.. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ సక్సెస్ కాలేకపోతున్నాడు. ఐపీఎల్ లో బలవంతంగా ముంబై జట్టు అతడిని కొనసాగిస్తోంది. గత సీజన్లో అతడికి ఒక్క మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం రాలేదు. అంతకుముందు సీజన్లో ఏదో ఒక మ్యాచ్లో ఆడించినప్పటికీ.. ప్రతి బంతికి అతి చేశాడు. గత ఏడాది జరిగిన మేగా వేలంలో అతడిని ముంబై జట్టు యాజమాన్యం కొనుగోలు చేయలేదు. దీంతో సచిన్ రంగంలోకి దిగి సిఫారసు చేయడంతో ఏదో నామమాత్ర ధరకు అర్జున్ టెండూల్కర్ ను ముంబై జట్టు యాజమాన్యం కొనుగోలు చేసింది. ఇటీవల అర్జున్ నిశ్చితార్థం చేసుకున్నాడు.. అతని కెరియర్ కూడా అంత గొప్పగా లేదు. దేశవాళి టోర్నీలలో కూడా అతడు మేరుగా రాణించలేకపోతున్నాడు.

Also Read: బాబీ తో మూవీని అనౌన్స్ చేసిన చిరంజీవి…బ్లేడి బెంచ్ మార్క్…

సచిన్ కుమారుడి కెరియర్ అంత గొప్పగా లేకపోయినప్పటికీ.. అతడి కుమార్తె మాత్రం తనకు నచ్చిన రంగంలో రాణిస్తున్నది. తన తండ్రి లెగసీని కాపాడుతున్నది. ఇదే విషయాన్ని సచిన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ” ఇది గొప్ప విషయం. నా కుమార్తె సారా ఇటుకాఇటుక పేర్చుకుంటూ ఇక్కడ దాకా వచ్చింది. ఇదంతా కూడా ఆమె స్వీయ కృషి. అందువల్లే ఈ స్థాయికి ఎదిగింది. ఆమె మరింత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని” సచిన్ వ్యాఖ్యానించాడు.

సచిన్ కూతురు సారా ముంబైలోని ఆందేరీ ప్రాంతంలో “పైలెట్స్” అనే పేరుతో వెల్నెస్ స్టూడియో, స్మూతీ బార్ ను ప్రారంభించింది. “పైలెట్స్” అనేది దుబాయ్ కి చెందిన ప్రసిద్ధ ఫిట్నెస్ స్టూడియో. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు ఇది నాల్గవ శాఖ. ఇది ఫిట్నెస్, పోషకాహారం, ఆరోగ్య మెలకువలు వంటి వాటిపై అవగాహన కల్పిస్తుంది. పైలెట్స్ స్టూడియోలో అధునాతనమైన ఫిట్నెస్ స్టూడియో ఉంటుంది.. క్లినికల్ న్యూట్రిషన్ లో కీలకపాత్ర పోషిస్తుంది.

“బరువు ఎక్కువగా ఉన్నవారు.. పోషకాల లోపం వల్ల బాధపడుతున్నవారు.. ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న వారు పైలెట్స్ స్టూడియో లో జాయిన్ అవ్వచ్చు. గతంలో జాయిన్ అయినవారు అద్భుతమైన ఫలితాలను చవిచూశారు. బాలీవుడ్ ప్రముఖులు.. ఇతర ఇతర వ్యక్తులు తమ అధిక బరువును తగ్గించుకున్నారు. శరీరాన్ని నాజకుగా మార్చుకున్నారు. వర్కౌట్ మాత్రమే కాదు డైట్ వంటి వాటిల్లో కూడా ఈ స్టూడియో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. శరీరంలో పోషకాల సమతుల్యాన్ని పాటించేలా చేస్తుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మాత్రమే కాదు.. బరువు తగ్గించుకోవడంలో ఈ స్టూడియో తోడ్పడుతుంది. ఇక్కడ అన్ని రకాల నిపుణులు ఉన్నారు.. అందువల్ల ఇందులో చేరిన వారు అద్భుతంగా తమ జీవన కాలాన్ని సాగించుకోవచ్చని” సారా పేర్కొంది.

సారా టెండూల్కర్ కు పైలెట్స్ స్టూడియోతో లండన్లో మొదటి పరిచయం ఏర్పడింది. ఎందుకంటే సారా తన విద్యాభ్యాసాన్ని లండన్ లో కొనసాగించింది. అప్పుడే ఆమెకు పైలెట్స్ స్టూడియో పరిచయమైంది. ఆ తర్వాత అందులో ఆమె చేరింది. తన శరీరాన్ని పూర్తిగా మార్చుకుంది. అప్పటినుంచి పైలెట్స్ స్టూడియోను ఇండియాలో ఏర్పాటు చేయాలనేది తన కలగా పెట్టుకుంది సారా. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా స్టూడియోను ఏర్పాటు చేసుకుంది. అందులో కేఫ్, స్మూతీ బార్ కూడా ఏర్పాటు చేసుకుంది.


[

Leave a Comment