వంట కోసం ప్రతి ఇంట్లో కుక్కర్లను ఉపయోగిస్తుంటారు. బియ్యం నుంచి పప్పులు, సాంబారు తయారు చేయడం వరకు ఉడికిండం ప్రెషర్ కుక్కర్లు సులభంగా చేసేస్తాయి. ఇది పనిని కూడా సులభతరం చేస్తుంది. కానీ కొన్నిసార్లు కుక్కర్ వాడకంలో తెలిసీ తెలియక చేసే పొరబాట్లు ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది. ముఖ్యంగా పాత ప్రెషర్ కుక్కర్‌లను ఎక్కువ కాలం ఉపయోగించడం ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. ఇటీవల ముంబైకి చెందిన 50 ఏళ్ల వ్యక్తి లెడ్ పాయిజనింగ్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. అతను దాదాపు 20 సంవత్సరాలుగా అదే అల్యూమినియం కుక్కర్‌లో వంట చేస్తున్నాడని దర్యాప్తులో తేలింది. దానిలోని సీసం అతని శరీరంలోకి ప్రవేశించి, ప్రాణాంతకంగా మారినట్లు వైద్య నిపుణులు అంటున్నారు.
ప్రెషర్ కుక్కర్ కంటైనర్లలో సీసం విషంలా పనిచేస్తుందా?
అల్యూమినియం వంట సామాగ్రిలో సీసం ఒక భాగం మాత్రమే. అయితే ఇది నేరుగా బయటకు కనిపించకుండా వంట సామాగ్రి లోపలి ఉపరితలం నికెల్‌తో పూత పూయబడి ఉంటుంది. తద్వారా ఆహారం దానికి అంటుకోదు. కాలక్రమేణా ఈ పూత తొలగిపోవడం ప్రారంభమవుతుంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఆహారాన్ని వండినప్పుడు కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. అందువల్ల వంట సామాగ్రి ఉపరితలం అరిగిపోయినప్పుడు, అల్యూమినియం స్క్రాప్ ఉపయోగించినప్పుడు, వంట సామాగ్రిని కరిగించినప్పుడు.. వీటిల్లోని సీసం వంట సామాగ్రిలోకి ప్రవేశిస్తుంది. నిజానికి.. వంట సామాగ్రితో పాటు పాత పెయింట్, పాత నీటి పైపులలో కూడా సీసం ఉంటుంది.
అల్యూమినియం కుక్కర్ నుంచి సీసం శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది?
అల్యూమినియం కుక్కర్ అధిక కాలం వడటం వల్ల అది పాతదైతే, దాని పూత తొలగిపోవడం ప్రారంభమవుతుంది. టమోటాలు, చింతపండు వంటి ఆమ్ల ఆహారాలను ప్రతిరోజూ ఆ పాత పాత్రల్లో వండినట్లయితే సీసం, అల్యూమినియం వంటి లోహాలు ఆహారంలోకి లీకయ్యే అవకాశం ఉంది. ఇది ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది.
ఇవి కూడా చదవండి
సీసం శరీరంలోకి ప్రవేశిస్తే ఏమి జరుగుతుందంటే..?
అధిక కాలం వాడే పాత పాత్రలలో ముఖ్యంగా అల్యూమినియం పాత్రలలో వంట చేయడం వల్ల సీసం విషంలా మారుతుంది. శరీరంలోకి ప్రవేశించే ఈ సీసం నెమ్మదిగా పేరుకుపోతుంది. శరీరంలో సీసం పరిమాణం ప్రమాదకర స్థాయికి చేరుకున్నప్పుడు అది విషంలా మారి ప్రాణాపాయం కలిగిస్తుంది. ఈ విషప్రయోగం క్రమంగా మెదడు, నరాలు, మూత్రపిండాలు, పునరుత్పత్తి వ్యవస్థ, జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ప్రారంభంలో ఆ లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు అలసట, చిరాకు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలలో ఈ లక్షణాలు ఇంకా తక్కువగా కనిపిస్తాయి. కానీ అవి నెమ్మదిగా తీవ్రమైన అనారోగ్యాలుగా అభివృద్ధి చెందుతాయి. కానీ జనాలు దీనిని సాధారణ అలసటగా భావించి విస్మరిస్తుంటారు.
దీనిని నయం చేయవచ్చా?
ఒంట్లో ఈ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే చికిత్స సాధ్యమవుతుంది. రోగికి చెలేషన్ థెరపీతో చికిత్స చేయవచ్చు. చికిత్సలో భాగంగా రక్తంలో సీసాన్ని బంధించి, మూత్రం ద్వారా శరీరం నుంచి తొలగించే మందులు ఇస్తారు. ఈ చికిత్స సమయంలో దుష్ప్రభావాల ప్రమాదాన్ని నివారించడానికి రోగిని క్రమం తప్పకుండా వైద్యులు పర్యవేక్షిస్తుంటారు.
శరీరంలోకి సీసం చేరకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- అధిక కాలంగా వాడుతున్న పాత అల్యూమినియం పాత్రలలో వంట చేయడం మానుకోవాలి.
- టమోటాలు, చింతపండు, పెరుగు మొదలైన పుల్లని పదార్థాలు ఉన్న ఆహారాన్ని పాత పాత్రలలో వండకూడదు.
- పాత్రలపై పూత తొలగిపోవడం ప్రారంభిస్తే వెంటనే ఆ పాత్రలను మార్చాలి.
- అలసట, నాడీ సంబంధిత రుగ్మతలు కనిపిస్తే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మర్చిపోవద్దు.
- అల్యూమినియం కుక్కర్లు, కుండలలో ఆమ్ల ఆహారాలను వండకపోవడమే మంచిది. బదులుగా స్టెయిన్‌లెస్ స్టీల్, హార్డ్ అనోడైజ్డ్, సిరామిక్
- వంటి సామాగ్రిని వంట కోసం ఉపయోగించాలి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.
[