India Russia Relations: ప్రపంచంలో శక్తివంతమైన దేశం రష్యా.. ఆర్థికంగా వేగంగా వృద్ధి చెందుతున్న దేశం భారత్. ఈ రెండు దేశాలు చాలాకాలంగా పరస్పర సహకారంతో ముందుకుసాగుతున్నాయి. ఇటీవల చైనాతోనూ సత్సంబంధాలు పునరుద్ధరించుకుంటోంది భారత్. మరోవైపు రష్యా–చైనా మధ్య కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో భారత్–రష్యా బంధాలను విడగొట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే 50 శాతం టారిఫ్‌లు విధించారు.ట్రంప్ భారత్‌పై విధించిన అదనపు సుంకాలు, ముఖ్యంగా రష్యా నుంచి చమురు దిగుమతుల కారణంగా తీసుకున్న ఈ నిర్ణయం, అంతర్జాతీయ వాణిజ్యంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ చర్య భారత్–అమెరికా ఆర్థిక సంబంధాలపై ఒత్తిడి తెచ్చినప్పటికీ, రష్యా–భారత్ మధ్య దీర్ఘకాలిక ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతోంది. రష్యా ఈ సందర్భంలో భారత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించడం, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించాలనే ఆశయం వ్యక్తం చేయడం గమనార్హం.
Also Read: దేశం వీడుతున్న మేధావులు.. కారణం ఇదే!
బలంగా రష్యా–భారత్ ఆర్థిక సంబంధం..
రష్యా, భారత్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం ఆర్థిక, రాజకీయ, రక్షణ రంగాల్లో లోతైన బంధాన్ని కలిగి ఉంది. ఏడేళ్లలో భారత్ నుంచి రష్యాకు ఎగుమతులు ఏడు రెట్లు పెరిగాయి, ముఖ్యంగా చమురు దిగుమతులు రికార్డు స్థాయిలో 69 బిలియన్ డార్లకు చేరాయి. రష్యా ఉపమిషన్ చీఫ్ రోమన్ బబుష్కిన్ ఈ సంబంధాన్ని ‘నిజమైన వ్యూహాత్మక భాగస్వామ్యం‘గా అభివర్ణించారు, ఇది పాశ్చాత్య దేశాల నీయోకాలనియల్ విధానాలకు విరుద్ధంగా స్వతంత్ర ఆర్థిక సహకారాన్ని సూచిస్తుంది. రష్యా భారత్‌కు తన మార్కెట్‌ను సంపూర్ణంగా తెరిచి, అమెరికా సుంకాల వల్ల ఏర్పడే నష్టాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించింది. అమెరికా విధించిన 50% సుంకాలు (25% బేస్ సుంకం + 25% అదనపు శిక్షాత్మక సుంకం) భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి, ముఖ్యంగా టెక్సై్టల్స్, లెదర్, సముద్ర ఉత్పత్తుల వంటి రంగాలు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి, ఇది భారత ఎగుమతులను 40–50% వరకు తగ్గించవచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్‌ఐ) అంచనా వేసింది. ఈ చర్యను భారత్ ‘అన్యాయం, అసమంజసం‘ అని ఖండించింది, ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి ఒత్తిడికి తలొగ్గబోమని స్పష్టం చేశారు. అయితే, భారత ఆర్థిక వ్యవస్థలో దేశీయ డిమాండ్ బలంగా ఉండటంతో ఈ సుంకాల ప్రభావం 0.2–0.3% జీడీపీ తగ్గుదలకు మాత్రమే పరిమితం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
చమురు ఒప్పందాలు కీలకపాత్ర
రష్యా నుంచి చమురు దిగుమతులు భారత్‌కు ఆర్థిక, శక్తి భద్రతా దృష్ట్యా కీలకమైనవి. 2022లో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, భారత్ రష్యా నుంచి గణనీయమైన చమురు దిగుమతులను పెంచింది. ఇది ప్రస్తుతం దేశ శక్తి అవసరాలలో 40% వాటాను కలిగి ఉంది. రష్యా ఆఫర్ చేస్తున్న తగ్గింపు ధరలు భారత్‌కు ఆర్థిక లాభాన్ని అందించాయి. అదే సమయంలో రష్యాకు ఆర్థిక స్థిరత్వాన్ని చేకూర్చాయి. ఈ దిగుమతులను నిలిపివేయడం వల్ల భారత్‌కు సంవత్సరానికి 9 నుంచి12 బిలియన్ డాలర్ల అదనపు ఆర్థిక భారం పడవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక అంచనా వేసింది. రష్యా ఈ సందర్భంలో భారత్‌కు తన చమురు సరఫరాను కొనసాగించడానికి హామీ ఇచ్చింది, ఇది ఇరు దేశాల ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
Also Read: పుతిన్ కు ఏమైంది? ట్రంప్ ని కలిసింది డూప్లికేటా?
రష్యా–భారత్ ఆర్థిక భాగస్వామ్యం అమెరికా సుంకాల ఒత్తిడి నీడలోనూ బలంగా నిలిచి ఉంది. రష్యా సంపూర్ణ మద్దతు, చమురు సరఫరా, రక్షణ సహకారం, ఎగుమతి అవకాశాలు ఈ బంధాన్ని మరింత దృఢం చేస్తున్నాయి. అమెరికా ఏకపక్ష చర్యలు భారత్‌ను తాత్కాలికంగా ఇబ్బంది పెట్టినప్పటికీ, రష్యా–భారత్ సహకారం దీర్ఘకాలికంగా ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలను అందిస్తుంది.