
ఏపీ ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేసింది. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్‌లో సీఎం చంద్రబాబు దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ చోటుచేసుకున్న ఒక ఆసక్తికర సంఘటన అందరినీ ఆకట్టుకుంది. ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించిన తర్వాత సీఎం చంద్రబాబు వివిధ ఆవిష్కరణలను పరిశీలించారు. ఈ క్రమంలో ఒక రోబో ఆయనకు అభివాదం చేస్తూ నమస్కరించింది. దానికి ప్రతిగా సీఎం చంద్రబాబు కూడా ఆ రోబోకు నమస్కరించారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో కొత్త సాంకేతికతలు, స్టార్టప్‌లు, పరిశోధనలను ప్రోత్సహించడానికి వివిధ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ హబ్ రాష్ట్రంలో టెక్నాలజీ, ఆవిష్కరణల రంగానికి కొత్త ఊపునిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.