విశాలాంధ్ర – నిడదవోలు : ఆధునిక సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాన్ని దేశంలో అభివృద్ధి పరచిన ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకే దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మేడవరపు భద్రం దొర అన్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో కోఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు,వృద్ధులకు పండ్లు తినుబండారాలను పంపిణీ చేశారు.అనంతరం కాపుల వీధి ఆంజనేయస్వామి గుడి వద్ద ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో షేక్ జిలాని, షేక్ నాగూర్, కాకి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
