హైదరాబాద్, ఆగస్ట్ 20: పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ పై నుంచి పడి ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బేగంపేట నుంచి బంజారాహిల్స్ కు ముగ్గురు వ్యక్తులు బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్దకు చేరుకోగానే అతివేగంతో వెళ్తున్న పల్సర్ బైక్ అదుపుతప్పి ఫ్లైఓవర్ సైడ్‌వాల్‌ను ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్ పైనుంచి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులకు కాళ్లు, చేతులు విరిగిపోయాయి. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో పోలీసులు, స్థానికులు ఉలిక్కిపడ్డారు.
బేగంపేట్ నుంచి బంజారాహిల్స్ వస్తు్ండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. గాయాలైన ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుసమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.