వృషభం: ఈ రాశికి నాలుగవ స్థానంలో కేతువు సంచారం వల్ల ఈ రాశివారికి సుఖ నాశనం కలుగుతుంది. కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. విభేదాలు, వివాదాలు, అపార్థాలు విజృంభిస్తాయి. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి. శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. గృహ, వాహన ప్రయత్నాలు ముందుకు సాగవు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ రాశివారు కేతువుకు ఆలయాల్లో పరిహారం చేయించడం మంచిది.
సింహం: ఈ రాశిలో కేతువు సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోగ నిర్ధారణకు అందని అనారోగ్యాలు కలగడానికి అవకాశం ఉంది. బంధువుల నుంచి నిందలు, విమర్శలు రావడం జరుగు తుంది. ఉద్యోగంలో ప్రాభవం తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. జీవిత భాగస్వామితో సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారు. పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు, నిరాశా నిస్పృహలు ఎదురవుతాయి. ఈ రాశివారు రోజూ సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.
కన్య: ఈ రాశివారికి వ్యయ స్థానంలో కేతువు సంచారం వల్ల రహస్య శత్రువులు తయారవుతారు. నర ఘోష ఎక్కువగా ఉంటుంది. మిత్రుల్ని కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. ధన వ్యయం, ధన నష్టం ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు పడడం జరుగుతుంది. ప్రయోజనం లేని ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతుంది. ఈ రాశివారు కేతువుకు తరచూ పూజ చేయించడం, స్కంద స్తోత్రం పఠించడం మంచిది.
వృశ్చికం: ఈ రాశికి దశమ స్థానంలో కేతువు సంచారం వల్ల ఉద్యోగ జీవితంలో వేధింపులు, సహాయ నిరాకరణ, విమర్శలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అనేక పర్యాయాలు ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదల నిలిచిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ తగ్గుతుంది. ఉద్యోగంలో పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ రాశివారు కేతువుకు ప్రత్యేక పరిహారం చేయించడం అవసరం.
మకరం: ఈ రాశికి అష్టమ స్థానంలో కేతువు ప్రవేశం వల్ల జీవిత భాగస్వామి తరచూ అనారోగ్యాలకు గురవడం జరుగుతుంది. తేలికగా మోసపోవడం, తరచూ ధన నష్టం జరగడం, అధికారులు అన్యాయం చేయడం, ఆస్తి సమస్యలు పెరగడం వంటివి జరుగుతాయి. ఆర్థిక సంబంధమైన ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు, మదుపులు, పెట్టుబడులకు, వాగ్దానాలకు, ఉచిత సహాయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రాశివారు స్కంద సోత్రాన్ని ఎక్కువసార్లు పఠించడం మంచిది.
కుంభం: ఈ రాశికి సప్తమ స్థానంలో కేతువు సంచారం వల్ల జీవిత భాగస్వామితో ఎడబాటు కలిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురి కావడం, దూర ప్రాంతానికి బదిలీ కావడం, విభేదాలు తలెత్తడం వంటివి జరగవచ్చు. పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో కూడా అపార్థాలు తలెత్తుతాయి. నష్టదాయక వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలతో సమస్యలుంటాయి. ఈ రాశివారు ప్రతి రోజూ సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల లాభం ఉంటుంది.