మార్కులు తక్కువ వచ్చాయని.. సెక్షన్ మార్పు

  • మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

విశాలాంధ్ర -విజయవాడ (క్రైమ్): మార్కులు తక్కువ వచ్చాయని సెక్షన్ మార్పు తో మనస్తాపం చెంది ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లో జరిగింది. కేదారాజేశ్వరపేట 8వ లైన్ కు చెందిన మల్లవరపు చక్రవర్తి(15) బందరు రోడ్డులోని పీవీపీ మాల్ వెనుక ఉన్న నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తెలివైన విద్యార్థి కావడంతో చదువులో చురుగ్గా ఉంటాడు. కళాశాల వారు పెట్టిన పరీక్షలో మార్కులు తక్కువగా వచ్చాయని ఆ విద్యార్థిని సెక్షన్ మార్పు చేశారు. మనస్తాపం చెందిన విద్యార్థి తన బెడ్ రూమ్ లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Comment