ఎన్టీఆర్ వర్సెస్ నాగార్జున..ఈసారైనా ఎన్టీఆర్ పై చెయ్యి సాధిస్తాడా?

NTR-Vs-Nagarjuna

NTR Vs Nagarjuna: టాలీవుడ్ లో ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో పోటీలు జరిగాయి. అంటే ఒకే సమయంలో రెండు సినిమాలు విడుదల అవ్వడం,ఒక సినిమాకి భారీ వసూళ్లు రావడం, మరో సినిమాకు తక్కువ రావడం, ఇక సోషల్ మీడియా లో తక్కువ కలెక్షన్స్ వచ్చిన సినిమాని యాంటీ ఫ్యాన్స్ వెక్కిరించడం వంటివి చాలానే జరుగుతూ వస్తున్నాయి. 2016 సంక్రాంతిని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) ‘నాన్నకు ప్రేమతో’, బాలకృష్ణ ‘డిక్టేటర్’ మరియు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రాలు విడుదలయ్యాయి. వీటిల్లో ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం కలెక్షన్ల సునామీ ని సృష్టించింది అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో చిత్రానికి కూడా సూపర్ హిట్ టాక్ వచ్చింది కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి వచ్చినంత వసూళ్ళలో సగం కూడా నాన్నకు ప్రేమతో చిత్రానికి రాలేదు.

Read Also: మీకు తెలుగు రాదా అంటూ మంచు లక్ష్మి పరువు తీసేసిన అల్లు అర్జున్ కుమార్తె!

దీంతో అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కినేని ఫ్యాన్స్ ఈ పొంగల్ వార్ ని గుర్తు చేస్తూ నందమూరి ఫ్యామిలీ ని వెక్కిరిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్, నాగార్జున మధ్య ఆసక్తికరమైన పోరు ఈ నెల 14 న జరగనుంది. అక్కినేని నాగార్జున విలన్ గా నటించిన ‘కూలీ'(Coolie Movie), ఎన్టీఆర్ విలన్ గా నటించిన ‘వార్ 2′(War 2 Movie) చిత్రాలు ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. రెండు డబ్బింగ్ సినిమాలే, ఇద్దరూ కూడా విలన్ రోల్స్ ద్వారా మన ముందుకు రాబోతున్నారు. ఈ ఆసక్తికరమైన పోరు లో ఎన్టీఆర్ గెలుస్తాడా?, లేకపోతే నాగార్జున గెలుస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. ప్రస్తుతానికి అయితే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘కూలీ’ చిత్రానికి కనుచూపు మేర దూరం లో కూడా లేదు ‘వార్ 2’. ప్రీమియర్స్ నుండి ఈ చిత్రానికి మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ అవలీలగా వచ్చేలా ఉంది.

Read Also: టాలీవుడ్ కు… మాలివుడ్ కు తేడా చెప్పిన స్టార్ ప్రొడ్యూసర్…

ఓవర్సీస్ పక్కన పెడితే కనీసం రెండు తెలుగు రాష్ట్రాల్లో అయినా ‘వార్ 2’ లీడింగ్ చూపిస్తాడా అంటే అనుమానమే. ఎన్టీఆర్ నేటి తరం స్టార్ హీరో కావడంతో బెనిఫిట్ షోస్ వరకు హౌస్ ఫుల్స్ అవుతాయి. ఆ తర్వాత కూలీ మేనియా ని తట్టుకొని ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ పడాలంటే కచ్చితంగా పాజిటివ్ టాక్ ఒక రేంజ్ లో రావాలి. అదే విధంగా ఎన్టీఆర్ క్యారక్టర్ కూడా అభిమానులను నిరాశపర్చకుండా ఉండాలి. అలా ఉంటేనే ‘వార్ 2’ సక్సెస్ అవుతుంది. లేదంటే మరోసారి నాగార్జున చేతిలో చితకబాదుడే అని సోషల్ మీడియా లో ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్(Super Star Rajinikanth) కెరీర్ లో ‘కబాలి’ తర్వాత ఆ స్థాయి అంచనాల నడుమ విడుదల అవుతున్న చిత్రం ఇదే. పాజిటివ్ టాక్ అక్కర్లేదు, కేవలం పర్వాలేదు అనే రేంజ్ టాక్ వచ్చిన దుమ్ము దులిపేస్తుంది కూలీ చిత్రం.

Leave a Comment