ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

విశాలాంధ్ర- ధర్మవరం; 2025 సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని అనంతపురం, శ్రీ సత్య సాయి ఉమ్మడి జిల్లాలలోని ప్రభుత్వం రంగంలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న అన్ని కేడర్ల ఉపాధ్యాయులు 15 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు ఆత్మీయ ట్రస్ట్ ధర్మవరం వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. యుటిఎఫ్ ధర్మవరం జోన్ నాయకులతో కలసి ధర్మవరం పట్టణంలోని ఎన్జీవో కార్యాలయం నందు ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ బోధనలో అద్భుతమైన ప్రతిభతో పాటు విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తూ, నైతిక విలువలతో తమ సర్వీసులో ఎటువంటి క్రమశిక్షణ చర్యలకు లోను కాకుండా ఉన్న ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ఈనెల 20వ తేదీ లోపల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల కోసం దరఖాస్తులను అందజేయాలని తెలిపారు.మరిన్ని వివరాలకు 9030944717 , 9441734907 ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం జోన్ యూటీఎఫ్ నాయకులు రామకృష్ణ నాయక్, లక్ష్మయ్య, ఆంజనేయులు, హరికృష్ణ, రాంప్రసాద్, మేరీ వరకుమారి, నాగేంద్రమ్మ, సాయి గణేష్, రామకృష్ణ , నాగిరెడ్డి, రామాంజనేయులు, అమర్ నారాయణరెడ్డి, వెంకట కిషోర్, బి. ఆంజనేయులు, ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment