అందాల పోటీలపై ఉన్న శ్రద్ద పుష్కరాలపై లేదా.?

కాంగ్రెస్ ప్రభుత్వానికి అందాల పోటీపై ఉన్న శ్రద్ధ పుష్కరాల నిర్వహణపట్ల లేకుండా పోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు రూ.35 కోట్లు మాత్రమే కేటాయించారని, ఆ నిధులు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. కుంభమేళా సందర్భంగా 50 కోట్ల మంది భక్తులకు తమ ప్రభుత్వం అద్బుతమైన ఆతిథ్యమిచ్చిందని, కాళేశ్వరం పుష్కరాలకు విచ్చేసే 50 లక్షల మందికి సరైన ఆతిథ్యం ఇవ్వలేక పోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. పుష్కరాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందన్నారు.


ఏమైనా మాట్లాడితే కేంద్రం ఏం చేస్తోందని మాట్లాడతారని మండిపడ్డారు. అన్నీ కేంద్రమే చేస్తే ఇక మీరున్నది ఎందుకు? కేవలం ఒక ఏరియాకే పుష్కరాలను పరిమితం చేయడం సరికాదన్నారు. పుష్కర స్నానానికి వచ్చే భక్తులందరి కోర్కెలు తొలగిపోవాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు.
కాళేశ్వరం చాలా పవర్ ఫుల్ ప్లేస్. కేసీఆర్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో మనకు చాలా చెడ్డ పేరొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం కాళేశ్వరం ఆలయానికి రూ.వంద కోట్లు ఇస్తానని మొండి చేయి చూపిందని గుర్తు చేశారు. ప్రస్తుత సీఎం కూడా 200 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. గతంలో వేములవాడకు కూడా ఇట్లనే హామీ ఇచ్చారు. కానీ ఎన్ని నిధులిచ్చారో ప్రజలందరికీ తెలుసు. ఇకనైనా ఒట్టి హామీలను పక్కనపెట్టి కాళేశ్వరంను అద్బుతమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని బండి సంజేయ్ కుమార్ డిమాండ్ చేశారు.

Leave a Comment