Rain Alert In AP: ఏపీకి బిగ్ అలెర్ట్.. ప్రజలకు హెచ్చరిక!

Rain Alert In AP

Rain Alert In AP: ఏపీ ( Andhra Pradesh) ప్రజలకు చల్లటి కబురు. రాష్ట్రానికి వర్ష సూచన వచ్చింది. మరో మూడు రోజులపాటు ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. అందుకే విపత్తుల నిర్వహణ సంస్థ ముందుగానే హెచ్చరికలు జారీచేస్తోంది. ఉత్తర తమిళనాడుకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా రాయలసీమతో పాటు పల్నాడు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు తెలుస్తోంది. వర్షం కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.

Also Read: గౌతమ్ గంభీర్ కాదు.. టీమిండియా కు .. రవి శాస్త్రి, అనిల్ కుంబ్లే లాంటి వాళ్లే కావాలిప్పుడు!

* నేడు వర్షాలు పడే జిల్లాలు..
ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం అనంతపురం( Ananthapuram), శ్రీ సత్య సాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో సైతం తేలికపాటి వర్షాలు నమోదు అవుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది.

* ఈ జిల్లాలకు అధికం..
రేపు కూడా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రధానంగా రాయలసీమ( Rayalaseema ) జిల్లాలకి ఎక్కువ ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. మంగళవారం పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. మరోవైపు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లా, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒక తరహా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. బుధవారం అనంతపురం, శ్రీ సత్య సాయి, వైయస్సార్ కడప, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయి. అయితే వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉంది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తుంది. వర్షం పడే సమయంలో బహిరంగ ప్రదేశాలలో ఉండొద్దని.. పాడుబడిన భవనాలు, చెట్ల కింద నిల్చవద్దని సూచించింది.

Leave a Comment