Andhra Pradesh Liquor Scam: ఏపీలో( Andhra Pradesh) మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. వైసిపి హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ భారీగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 18 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండిపడగా.. 3500 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు అన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం సంచలన విషయాలను బయటపెడుతోంది. దాదాపు ఈ స్కాంలో 40 మంది నిందితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 12 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. ఇటీవలే రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి అరెస్టు అయ్యారు. ముందుగా సూత్రధారి రాజ్ కసిరెడ్డి అరెస్టు కాగా.. తరువాత వరుస అరెస్టులు కొనసాగుతున్నాయి. అప్పటి సీఎంఓ కీలక అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వంటి వారు అరెస్టయ్యారు. అయితే వీరి ప్రమేయం విషయంలో ఎటువంటి సమాచారం బయటకు రాకున్నా.. ఏ 34 నిందితుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు కు సంబంధించిన వీడియోలు వరుసగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని పరిశీలిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం మరింత లోతైన విచారణ కొనసాగిస్తోంది.
Also Read: ఎమ్మెల్యే రాసలీలలు.. వైరల్ వీడియో
చెవిరెడ్డికి సన్నిహితుడు
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడే ఈ వెంకటేష్ నాయుడు( Venkatesh Naidu ). మద్యం కుంభకోణంలో ఈయన పాత్ర కీలకం అన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి సూత్రధారి అయితే.. మద్యం కుంభకోణం ద్వారా కొల్లగొట్టిన సొమ్మును భద్రపరచడం, అప్పటి ప్రభుత్వ పెద్దలకు చేర్చడం వెంకటేష్ నాయుడు ప్రధాన విధిగా తెలుస్తోంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు సమయంలో తమకు ఏ పాపం తెలియదని.. ప్రభుత్వమే కక్ష సాధింపునకు దిగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆయనకు సన్నిహితుడిగా భావిస్తున్న వెంకటేష్ నాయుడు తాజా వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. భారీ డెన్ లు, నోట్ల కట్టలకు సంబంధించిన ఈ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. అంతటితో ఆగకుండా వెంకటేష్ నాయుడు విలాసవంతమైన జీవితానికి సంబంధించిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో సిట్ దర్యాప్తు మరింత లోతుగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
భారీ డెన్ లో
వెంకటేష్ నాయుడు కు సంబంధించిన వీడియో ఒకటి తొలుత వెలుగులోకి వచ్చింది. ఒక డెన్ లో భారీ నోట్ల కట్టలు లెక్కిస్తూ ఆయన కనిపించారు. అయితే తాజాగా ఆయన ప్రత్యేక విమానాల్లో విలాసవంతమైన ప్రయాణాలకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ప్రత్యేక విమానాల్లో మద్యం కుంభకోణానికి సంబంధించి సొమ్మును తరలిస్తున్నట్లు కూడా కామెంట్స్ వినిపించాయి. మరోవైపు సినీనటి తమన్నా ప్రత్యేక సెల్ఫీ.. స్పెషల్ ఫ్లైట్లో కనిపిస్తోంది. దీంతో యాపారం చాలా ఉంది అంటూ కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నేత కవితతో సైతం వెంకటేష్ నాయుడు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి. అయితే మద్యం కుంభకోణం ద్వారా కొల్లగొట్టిన సొమ్మును సేఫ్ జోన్ లో తీసుకెళ్లే బాధ్యత వెంకటేష్ నాయుడు దేనని ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా వెంకటేష్ నాయుడు చుట్టూ విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: టార్గెట్ కొడాలి నాని.. విచారణ, ఆపై అరెస్ట్?!
లోతైన దర్యాప్తు..
మద్యం కుంభకోణాన్ని తేలిగ్గా తీసుకుంది వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నిర్వహిస్తే.. ఇక కుంభకోణం ఎలా జరిగి ఉంటుందని వైసిపి అనుకూల విశ్లేషకులు విశ్లేషణలు జరిపారు. కానీ ఓ సామాన్య వ్యక్తి ఇలాంటి విలాసవంతమైన జీవితం, ప్రముఖులతో ఉన్న సాన్నిహిత్యం చూస్తే మాత్రం మద్యం కుంభకోణంలో భారీ తలకాయలు ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే అంతిమ లబ్ధిదారుడికి సింహభాగం.. మిగతా వారికి తిలా పిడికెడు అన్నట్టు సర్దుబాటు అయి ఉంటుందన్న అనుమానాలు పెరుగుతున్నాయి.
లిక్కర్ స్కాం నిందితుడు వెంకటేష్ నాయుడు.. ప్రత్యేక విమానంలో జల్సాలు డబ్బులు తరలించి నట్టు సమాచారం..
— (@Shiva4TDP) August 3, 2025
ఏపీ లిక్కర్ స్కాం A34 వెంకటేష్ నాయుడు..
ఢిల్లీ లిక్కర్ స్కాం A32 కవిత గారు.. pic.twitter.com/3c7OU6cRWt— venu swamy (@paulesupaadham) August 3, 2025