Personality: సమాజంలో ప్రతి ఒక్కరూ హుందాగా బతకాలని అనుకుంటూ ఉంటారు. కొందరు అందరితో సమానంగా జీవితాన్ని గడిపేస్తే.. మరికొందరు మిగతా వారి కంటే ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఒక్కోసారి మనం చేసే అలవాట్లు.. మనకు ఉండే ఆలోచనల మధ్య చాలా తేడా ఉంటుంది. సరైన అలవాట్లు ఉండడంవల్ల సమాజంలో ప్రత్యేకంగా కనిపిస్తారు. మరి ఆ అలవాట్లు ఏవో ఇప్పుడు చూద్దాం..
Also Read: ఏపీ అభివృద్ధికి జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్!
డ్రెస్సింగ్:
కొంతమంది డ్రెస్ వేస్తే చూడడానికి అట్రాక్టుగా ఉంటారు. మరికొందరు చిందరవందరగా ఉన్న డ్రెస్సులు ధరిస్తారు. పదిమందిలో ప్రత్యేకంగా కనిపించాలంటే డ్రెస్సింగ్ చక్కగా ఉండాలి. అంటే ఇది ఖరీదైనది కాకపోయినా.. క్లాసికల్ గా.. నీట్ గా ఉంటే ఇతరులు ఆదరిస్తారు. డ్రెస్సింగ్ వల్ల మనిషికి గుర్తింపు ప్రత్యేకంగా ఉంటుంది. ఈ డ్రెస్సింగ్ తోనే ఎదుటివారిని ఆకట్టుకొని విలువ పెంచుకోగలుగుతారు. అందువల్ల డ్రెస్సింగ్లో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి.
మాట:
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.. అన్న సామెత దీనికి పనిచేస్తుంది. మాట మంచిగా ఉంటే ఎవరైనా ఆదరిస్తారు. తక్కువ మాట్లాడుతూ.. అవసరం ఉన్నంత వరకు మాట్లాడటం వల్ల ఎక్కువగా విలువ ఉంటుంది. వాల్యూం తక్కువగా ఉంటే విలువ ఎక్కువగా ఉంటుంది. ఈ తక్కువ సమయంలో మెల్లగా మాట్లాడటం వల్ల ఎదుటివారు ఆదరించగలుగుతారు. మనం మెల్లగా మాట్లాడితేనే ఎదుటివారు పూర్తిగా వినగలుగుతారు. అందువల్ల మాటలను తక్కువగా మాట్లాడి సరైన విధంగా మాట్లాడితే సమాజంలో ప్రత్యేకంగా గుర్తింపు ఉంటుంది.
నడక:
పదిమందిలో ప్రత్యేకంగా కనిపించాలంటే.. నడక కూడా చాలా అవసరమే. మంచి నడక ఎదుటివారిని ఆకట్టుకోగలుగుతుంది. అటు ఇటు వంగుతూ.. తల కిందికి వేసి నడుస్తూ ఉండడం వల్ల చులకనగా మారిపోతారు. తల ఎత్తుకొని స్ట్రెయిట్ గా.. కాన్ఫిడెంట్ గా నడిస్తే ఎదుటివారు గుర్తింపు చేస్తారు. నడక బాగుంటే చూడడానికి కూడా ఆకర్షణీయంగా కనిపిస్తారు. అందువల్ల మంచి నడక నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
ప్రవర్తన:
ఎదుటివారి దృష్టిలో మంచివారేగా ఉండి పోవాలంటే ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. తప్పుడు పనులు చేస్తూ.. చెడ్డ వారిగా ఉండడం కంటే మంచి పనులు చేయడం వల్ల పదిమందిలో ప్రత్యేకంగా ఉండగలుగుతారు. ప్రవర్తన వల్ల ఎంతోమందిని ఆకట్టుకోగలుగుతారు. ప్రవర్తనతోనే మనిషికి విలువ పెరుగుతుంది. అది ఉందా తనాన్ని కూడా పెంచుతుంది.
గౌరవం:
మనిషికి ఉండే ప్రధాన లక్షణం గౌరవం. ఎదుటివారిని ఎంత బాగా గౌరవిస్తే.. వారు అంతే మర్యాదను ఇస్తూ ఉంటారు. ఇలా గౌరవంగా బతకాలని చూస్తే వారు సమాజంలో గుర్తింపు పొందుతారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చిన్నగా మాట్లాడుతూ వారికి మర్యాద ఇవ్వండి. అంతేకాకుండా వారు ఏం చెప్పినా విని వారితో సహకరించాలి. కొన్నిసార్లు మనకు ఇష్టమైన వాళ్ళు నచ్చని పనులు చేసినా వారిని గౌరవిస్తే.. వారు మారిపోయే అవకాశం ఉంటుంది.
ఇలా ప్రతి మనిషికి ఐదు లక్షణాలు ఉండటం వల్ల పదిమందిలో ప్రత్యేకంగా కనిపిస్తారు.
[