India National Debt 2025: దేశంలో ఒక్కొక్కరిపై రూ.1.32 లక్షల అప్పు..

India National Debt 2025: శీర్షిక చదవగానే షాక్‌ అయ్యారా.. నేనెవరి వద్ద అప్పు తీసుకోలేదు కదా అనుకుంటున్నారా.. ఇంత అప్పు.. ఎలా కట్టాలి అనుకుంటున్నారా.. హో… హో.. కంగారు పడకండి.. అప్పు ఉన్నమాట వాస్తవమే. కానీ అది మీరు చేసింది కాద.. అభివృద్ధి కోసం కేంద్రం చేసిన అప్పు. ఈ అప్పును దేశ జనాభాకు పంచగా 2025, మార్చి 31 నాటికి ఒక్కొక్కరిపై రూ.1,32,059 రుణ భారం ఉన్నట్లు కేంద్రమే వెల్లడించింది. ఇది పెరుగుతున్న దేశ రుణ భారాన్ని సూచిస్తుంది. 2025 మార్చి నాటికి దేశం అప్పులు రూ.181.68 లక్షల కోట్లకు చేరాయి.

Also Read: ఆ ఆపరేషన్ కు మహాదేవ్ పేరు ఎందుకు.. ఇన్నాళ్లుగా దొరకని ఉగ్రవాదులు ఎలా చిక్కారు?

భారీగా వడ్డీ..
ఇదిలా ఉంటే.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం, 2031 నాటికి కేంద్ర రుణాలను జీడీపీలో 50% లోపునకు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024–25లో ఈ నిష్పత్తి 57.1%గా ఉండగా, 2025–26 నాటికి 56.1%కి తగ్గించాలని భావిస్తోంది. ఈ లక్ష్యం ఆర్థిక స్థిరత్వాన్ని, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడంతో పాటు అంతర్జాతీయ రేటింగ్‌లను మెరుగుపరచడానికి దోహదపడుతుంది. ఇక ప్రస్తుత రుణాలకు కేంద్రం భారీగా వడ్డీ చెల్లిస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.5,92,900 కోట్లు, 2023–24లో రూ.5,10,640 కోట్లు, 2024–25లో రూ.5,11,180 కోట్లు వడ్డీ రూపంలో చెల్లించింది. ఇది జీడీపీలో 5 శాతం కన్నా ఎక్కువ. వడ్డీల భారం కారణంగా కేంద్రం, విద్య, వైద్యం కోసం వెచ్చించే నిధులు తగ్గిస్తోంది.

Also Read: నోట్లపై ఉండే ఈ గీతల అర్థం తెలుసా?

రుణం.. అన్నిరంగాలకు భారం..
రుణం అనేది అవసరాలకు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆదాయానికి మించి అప్పులు చేస్తే అది ఎవరికైనా భారమే. ప్రస్తుతం కేంద్రం నిబంధనల మేరకే అప్పులు చేస్తోంది. అయితే వడ్డీలు భారంగా మారుతున్నాయి. ఫలితంగా అన్నిరంగాలపై ప్రభావం చూపుఓతంది. అధిక ప్రభుత్వ రుణాలు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. పైవేట్‌ వ్యాపారాలకు రుణ ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. అధిక రుణ నిష్పత్తులు ఆర్థిక మాంద్యం సమయంలో ఆర్థిక సంస్కరణలకు ఆటంకంగా మారతాయి.

Leave a Comment