Google Gemini : ఇది జెమినీ మాయాజాలం భయ్యా.. ఎవరి సహకారం లేకుండానే యాప్ తయారు చేయవచ్చు!

Google Gemini: ప్రస్తుతం మనం సాంకేతిక యుగంలో ఉన్నాం. ప్రతి పని కూడా జస్ట్ ఒక టచ్ తో చేసుకుంటున్నాం. తినే తిండి నుంచి మొదలుపెడితే తాగే నీరు వరకు.. వండుకునే కూరగాయల నుంచి మొదలు పెడితే పడుకునే దుప్పట్ల వరకు ప్రతిదీ కూడా టెక్నాలజీతోనే సాగిస్తున్నాం. టెక్నాలజీ ద్వారానే బతుకుతున్నాం. అటువంటి టెక్నాలజీ రోజురోజుకు కొత్త కొత్త మార్పులకు గురవుతోంది. ఒకప్పుడు వింత అనుకున్నది ఇప్పుడు రొటీన్ అయిపోయింది. ఆ రొటీన్ ఆధారంగానే లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది.

టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో యాప్స్ అనేవి మన జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. అయితే ఈ యాప్ కనిపెట్టాలి అంటే చాలా కసరత్తు చేయాలి. కోడింగ్ రాయాలి. ప్రత్యేకంగా డిజైన్ చేయాలి. డిజైన్ చేసిన దానిని రకరకాల పరీక్షలు చేసి.. ఫైనల్ అప్రూవల్ చేయాలి. ఆ తర్వాత దీనిని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ లో అందుబాటులో పెట్టాలి. దానికంటూ ఒక సర్వర్ ఏర్పాటు చేసుకోవాలి. ఇంత కసరత్తు ఉంటుంది కాబట్టి యాప్ తయారు చేయాలంటే చాలా ఖర్చు పెట్టాలి.

అయితే ఈ కసరత్తు మొత్తం గతం.. ఎందుకంటే గూగుల్ జెమిని ద్వారా ఈ యాప్ సృష్టించడం అత్యంత సులభం. గూగుల్ “జెమినీ” అత్యంత శక్తివంతమైన కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనివల్ల ఏమాత్రం కష్టపడకుండానే మొబైల్ యాప్ సృష్టించవచ్చు. వాస్తవానికి ఒక అప్లికేషన్ సృష్టించాలంటే దానికోసం అనేక కష్టాలు ఎదుర్కోవాలి. ఎంతోమంది మేధావులు తమ మేధస్సును రంగరించాలి. కానీ జెమినీ తో అంత కసరత్తు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎటువంటి అప్లికేషన్ తయారు చేయాలో.. దాని స్ట్రక్చర్ ఎలా ఉండాలో జెమినీ కాన్వాస్ టూల్ లో గీయాలి.. ఆ చిత్రాన్ని అందులోకి అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఇది కూడా సాధ్యం కాకపోతే నాకు వంటల యాప్ కావాలి.. అందులో అనేక రకాల రెసిపీలు ఉండాలి.. దానికి తగ్గట్టుగా ఫోటోలు కూడా ఉండాలి.. అంటే చెప్తే సరిపోతుంది.. మీరు చెప్పినట్టుగా లేదా గీసినట్టుగా జెమిని ఒక యాప్ రూపొందిస్తుంది. యాప్ తయారీ వెనుక ఉండే లాజిక్ మొత్తాన్ని అది స్వయంగా రూపొందిస్తుంది. కొన్ని సెకండ్ల విధిలోనే మీరు ఉపయోగించగలిగే స్థాయిలో యాప్ కోడ్ మీకు అందిస్తుంది. దీనివల్ల అత్యంత సామాన్యమైన వ్యక్తి కూడా తన కలల యాప్ ను అత్యంత తక్కువ సమయంలో సొంతంగా తయారు చేసుకోవచ్చు.

[

Leave a Comment