బుధుడిని సాధారణంగా తెలివితేటలు, తర్కం, గణితం, కమ్యూనికేషన్, వ్యాపారానికి కారకుడిగా పరిగణిస్తారు. బుధుడు శుభ స్థితిలో ఉన్నప్పుడు వ్యక్తికి వాక్చాతుర్యం, పదునైన ఆలోచన శక్తి, నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని అందిస్తాడు. అయితే అదే బుధుడు పాప గ్రహం ప్రభావంలోకి వచ్చినప్పుడు లేదా జాతకంలో తక్కువ స్థానంలో ఉన్నప్పుడు.. బుధ దోషం ఏర్పడుతుంది.
చాలా మందికి ఈ దోషం గురించి తెలియదు. జీవితంలో పదే పదే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, కమ్యూనికేషన్ వైఫల్యం, చర్మ రుగ్మతలు, మానసిక అశాంతి ఈ గ్రహం దుష్ప్రభావాల వలన కావచ్చు. బుధ దోషం అంటే జాతకంలో బుధ గ్రహం ప్రతికూల ప్రభావం. ఇది వివిధ రూపాల్లో వ్యక్తమవుతుంది. ఈ దోషం ఉన్నవారి తెలివితేటలను గందరగోళానికి గురి చేస్తుంది. మాటలను కఠినంగా చేస్తుంది. వ్యాపారాన్ని వైఫల్యం వైపు నెట్టివేస్తుంది.
జాతకంలో బుధ దోషం అంటే ఏమిటి?
- జాతకంలో బుధ గ్రహం ఈ క్రింది స్థానాల్లో ఉన్నప్పుడు.
- శత్రు గ్రహాలతో (కుజుడు, రాహువు, శని వంటివి) సంయోగం.
- దుష్ట గ్రహాల దృష్టిలోకి రావడం.
- నీచ రాశి (మీన రాశి) లో ఉండటం.
- రాహువు లేదా కేతువుతో సంయోగం ఉంటే ఆ వ్యక్తి బుధ దోషాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
బుధ దోష లక్షణాలు
- ప్రసంగ లోపాలు: తరచుగా అబద్ధాలు చెప్పడం, అసభ్యకరమైన భాష, సంభాషణలో గందరగోళం.
- మానసిక అస్థిరత: నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది. ఆలోచనల గందరగోళం.
- చర్మం, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఏర్పడడం.
- వ్యాపారంలో నిరంతర వైఫల్యాలు.
- చదువులో అడ్డంకి, జ్ఞాపకశక్తి లోపం.
- నిరాశ , చిరాకు. సామాజిక అపార్థాలకు బలి అవుతున్నారు.
- బుధ దోష నివారణకు ఏమి చేయాలంటే
- బుధ దోషాన్ని నివారించడానికి బుధవారం ఉపవాసం ఉండండి.
- ఆకుపచ్చ దుస్తులను ధరించండి.
- తులసి మొక్కను, విఘ్నాలకధిపతి గణపతిని పూజించండి.
- రోజులో ఒకపూట మాత్రమే సాధారణ భోజనం తినండి.
- “ఓం బ్రాం బ్రీం బ్రౌం సః బుధాయ నమః” అనేది బుధ గ్రహానికి సంబంధించిన బీజ మంత్రాన్ని జపించండి
- ఈ మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు జపించండి ముఖ్యంగా బుధవారం రోజున జపించండి.
- జ్యోతిష్యుడిని సంప్రదించిన తర్వాత.. , ప్రత్యేక బుధ శాంతి పూజ చేయించుకోండి.
జ్యోతిష పరిహారాలు
- బుధవారం గణేష్ ఆలయంలో పంచామృత అభిషేకం చేయండి.
- బుధ గ్రహం దశ-మహాదశ సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి.
- బుధ దోషాన్ని శాంతింపజేయడానికి రుద్ర అభిషేకం చేయండి.
- గణేశుడికి 21 దర్భలను సమర్పించండి.
- పెసలు, కూరగాయలు, పచ్చని బట్టలు, కంచు పాత్రలను దానం చేయండి.
- బ్రాహ్మణులకు బుధ గ్రహానికి సంబంధించిన వస్తువులను దానం చేయండి.
- తులసి దళాలను తినడం వలన మానసిక శుద్ధి అవుతుంది. అంతేకాదు బుధ గ్రహాన్ని శాంతపరచడంలో సహాయపడుతుంది
- జాతకం ప్రకారం అర్హత ఉంటే.. పచ్చ రత్నాన్ని ధరించండి.
- జ్యోతిష్యం ప్రకారం బుధ గ్రహం మిథున, కన్యా రాశుల వారిని, 5, 14, 23 తేదీలలో జన్మించిన వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుందని నమ్ముతారు.
- ఇది విద్యార్థులు, వక్తలు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.
బుధ దోషాన్ని తక్కువ అంచనా వేయకండి. ఇది కమ్యూనికేషన్, ఆలోచనా శక్తిని ప్రభావితం చేయడమే కాదు కెరీర్, సంబంధాలు, ఆరోగ్యంపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సరైన సమయంలో ఈ దోషాన్ని గుర్తించి పరిహరాలను చేయడం ద్వారా జీవితంలో సానుకూల మార్పులు సాధ్యమవుతాయి. జీవితంలో పదే పదే సమస్యలను ఎదుర్కొంటుంటే జన్మ కుండలిలో బుధుడి స్థానాన్ని ఒకసారి తనిఖీ జ్యోతిష్యుడిని సంప్రదించండి.