Action thriller Vachinavadu Gautham

– Advertisement –

యంగ్ హీరో అశ్విన్ బాబు నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ’వచ్చినవాడు గౌతమ్’ ( vachina vadu Gautham) టీజర్‌తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. శుక్రవారం హీరో అశ్విన్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఒక పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అశ్విన్ బాబు ఇంటెన్స్ లుక్ (Ashwin Babu intense look) లో కనిపించిన ఈ పోస్టర్ అదిరిపోయింది. ఇటీవలే భారీ బడ్జెట్‌తో హైవోల్టేజ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ పూర్తి చేశారు. రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అజయ్, విటివి గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.

 

– Advertisement –

Leave a Comment