Samantha Career Update: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు సమంత(Samantha Ruth Prabhu). మొదటి సినిమా ‘ఏ మాయ చేసావే’ సినిమాతోనే ఈమె స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రానటువంటి సమంత, సౌత్ లో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని తన ఖాతాలో వేసుకుంది. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి సూపర్ హిట్స్ ని అందుకుంది. సమంత అంటే పేరు కాదు, బ్రాండ్ అనే రేంజ్ లో ఎదిగింది. హీరోయిన్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా, పీక్ క్రేజ్ ఉన్న సమయంలోనే విలన్ రోల్స్ కూడా చేసి తన సత్తా చాటుకుంది.
Also Read: పెళ్లి చేసుకుంటే భార్య ఇంటికి వెళ్లాలి.. పిల్లలకు తల్లి ఇంటి పేరు పెట్టాలి.. ఈ ప్రాంతం మనదేశంలో ఎక్కడుందో తెలుసా?
సినీ రంగం లో ఇంకా ఆమె చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి. చెయ్యాల్సిన విలక్షణమైన పాత్రలు మిగిలే ఉన్నాయి. కానీ త్వరలోనే ఆమె నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పి కేవలం నిర్మాతగా మాత్రమే కొనసాగాలని అనుకుంటుందట. అనారోగ్యం కారణంగా కొంతకాలం సినిమాలకు విరామం తీసుకున్న సమంత, మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తూ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థని మొదలు పెట్టింది. ఈ సంస్థ ద్వారా ఆమె నిర్మించిన మోదాత్రి చిత్రం ‘శుభమ్’ ఈ ఏడాది విడుదలై మంచి కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది. ఇలాంటి సినిమాలను నిర్మించి ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలను చూడాలని అనుకుంటుందని, అనారోగ్య సమస్యల కారణంగా డాక్టర్లు ఎక్కువ ఒత్తిడి తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పడం తో సమంత ఈ నిర్ణయం తీసుకుందని, పైగా ఈ ఏడాది లో కానీ, వచ్చే ఏడాది ప్రారంభం లో కానీ ఆమె రాజ్ నిడిమోరు ని పెళ్లాడబోతుందని, పెళ్లి తర్వాత శాశ్వతంగా నటనకు దూరం అవ్వాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.
Also Read: ప్రియుడితో ఏకాంతంగా.. భార్య చాటుబంధాన్ని భర్త రట్టు చేశాడిలా..
సినిమాలను మానేయాలనే ఉద్దేశ్యంతోనే ఆమె అల్లు అర్జున్, అట్లీ మూవీ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో ఒక పవర్ ఫుల్ లేడీ విలన్ క్యారక్టర్ ఉందట, ముందుగా ఈ పాత్ర కోసం సమంత ని సంప్రదించారట, కానీ ఆమె నో చెప్పడంతో ఇప్పుడు ఆ క్యారక్టర్ రష్మిక చేస్తుంది. అదే విధంగా సల్మాన్ ఖాన్ తో నటించే అవకాశం వచ్చినప్పటికీ కూడా ఆమె ఈ కారణంతోనే రిజెక్ట్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతానికి ఆమె చేతిలో ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం ఉంది. ఈ సినిమాలో సమంత లీడ్ రోల్ పోషిస్తూ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. ఈ చిత్రం తో పాటు నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ‘రక్త బ్రహ్మాండ’ లో కూడా సమంత కీలక పాత్ర పోషిస్తుంది.