Allu Aravind Speech: ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద సైలెంట్ గా విడుదలై, బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ లాంటి వసూళ్లను రాబట్టిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాలకంటే, తక్కువ బడ్జెట్ తో తీసిన చిన్న సినిమాలే నిర్మాతల పాలిట లంకె బిందెలుగా మారుతున్నాయి. బయ్యర్స్ కూడా ఈ చిన్న సినిమాల ద్వారానే రూపాయికి 50 రూపాయిల లాభాలను ఆర్జిస్తున్నారు. అలాంటి చిత్రాల జాబితాలోకి రీసెంట్ గా విడుదలైన ‘మహావతార్ నరసింహా'(Mahavatar Narasimha) చిత్రం చేరింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ లైవ్ యానిమేషన్ చిత్రం బాక్స్ ఆఫీస్ సునామీ ని సృష్టించింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) కొనుగోలు చేసి ఇక్కడ విడుదల చేశాడు. తెలుగు లో కూడా బంపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతానికి బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు పాతిక వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి.
Also Read: ‘ఓజీ’ వెర్సస్ ‘కూలీ’..గెలిచింది ఎవరంటే!
ఇది ఇలా ఉండగా ఈ చిత్రం తెలుగు వెర్షన్ వసూళ్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న ఈ నేపథ్యంలో నిర్మాత అల్లు అరవింద్ కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి భావోద్వేగ పూరితమైన ప్రసంగం అందించాడు. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ప్రస్తావన తీసుకొస్తూ ‘పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి చెప్పాలి. సనాతన ధర్మం గురించి నాకు తెలిసిన సన్నిహితుల్లో కానీ, మా కుటుంబం లో కానీ, ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడితే మనం ముగ్దులం అవుతాము. కాబట్టి తప్పనిసరిగా వారు ఈ సినిమా చూడాలని, ఈ సినిమా గురించి మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. గమనించాల్సిన విషయం ఏమిటంటే ‘మహావతార్ నరసింహా’ చిత్రం జులై 25 న విడుదలైతే, పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రం జులై 24 న విడుదలైంది.
Also Read: బామ్మర్ధి కళ్లల్లో ఆనందం కోసం హరీష్ రగిలిస్తోన్న ‘సెంటిమెంట్’
‘హరి హర వీరమల్లు’ ఫలితం ఏంటో మనమంతా చూసాము. రెండు సనాతన ధర్మం కాన్సెప్ట్ మీద తెరకెక్కిన సినిమాలే, కానీ టెక్నాలజీ పరంగా, కంటెంట్ పరంగా ‘మహావతార్ నరసింహా’ చిత్రం ఆడియన్స్ ని సర్ప్రైజ్ కి గురి చేసి అద్భుతమైన థియేట్రికల్ అనుభూతి ని అందిస్తే, ‘హరి హర వీరమల్లు’ చిత్రం మాత్రం బలహీనమైన కాన్సెప్ట్ తో, నాసిరకపు VFX తో ఆడియన్స్ కి చిరాకు కలిగించింది. అందుకే రెండు సినిమాల ఫలితాల్లో ఇంతటి అనూహ్యమైన మార్పు. ఇది కాసేపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కి ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్స్ లో అల్లు అరవింద్ రిక్వెస్ట్ ని అంగీకరిస్తాడా లేదా అనేది చూడాలి.