తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య

దిశ, వెబ్ డెస్క్ : నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ(Telangana University)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. యూనివర్సిటీలోని సౌత్ క్యాంపస్ లో ఓ విద్యార్థిని సూసైడ్(Student Suicide) చేసుకొని మరణించింది. అశ్విని అనే పీజీ హాస్టల్ గదిలో లో చున్నీతో ఉరి వేసుకొని మరణానికి పాల్పడింది. ఆదివారం తోటి రూమేట్స్ బయటికి వెళ్లి వచ్చాక ఎంతసేపటి గది తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి సిబ్బందికి సమాచారం అందించగా.. తలుపులు బద్దలు కొట్టి చూడగా.. ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది.

పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకొని, మృత దేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా అశ్విని బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందినదిగా, యూనివర్సిటీలో తెలుగు సబ్జెక్టులో పీజీ చేస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు.

Leave a Comment