ఆ ఊరు పేరు‘ఫ్రెండ్‌షిప్’.. ఎందుకు అలా పిలుస్తున్నారో తెలిస్తే షాకవ్వాల్సిందే!?

దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ‘ఫ్రెండ్‌షిప్ డే’ ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇది ఆగస్టు మొదటి వారం ఆదివారం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది(2025) ఆగస్టు 03వ తేదీన వచ్చింది. ఈ క్రమంలో ఫ్రెండ్‌షిప్ డే అనేది కేవలం ఒక రోజే కాదు.. చిన్నతనంలో ఆటలు, కాలేజీలో సరదా గడిపిన క్షణాలు గుర్తుచేసే మధురమైన రోజు. ఫ్రెండ్‌షిప్ హృదయంతో ఏర్పడే బంధం.. దీనికి వయస్సు, భాష, కులంతో సంబంధం ఉండదు. ఎటువంటి సమయంలోనైనా మనకు ఎవరైతే అండగా ఉంటారో వారే మనకు నిజమైన స్నేహితుడు. అయితే ఈ ఫ్రెండ్‌షిప్ డే సందర్బంగా ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

విషయంలోకి వెళితే.. ‘ఫ్రెండ్‌షిప్’ పేరుతో పెద్ద పట్టణమే ఉంది. న్యూయర్క్‌లో వందల ఏళ్ల క్రితం అక్కడ రెండు తెగల మధ్య తరచూ గొడవలు జరిగేవట. అందుకే ఈ ప్రాంతాన్ని ‘ఫైటింగ్ కార్నర్స్’గా పిలిచేవారట. ఆ తర్వాత అక్కడుండే ప్రజలు కలిసిమెలిసి ఉండాలంటూ నిర్ణయించారు. ఈ మేరకు 1815లో ప్రజల మధ్య సయోధ్యను పెంపొందించడానికి ఆ పట్టణానికి అధికారికంగా ‘ఫ్రెండ్‌షిప్’ అని పేరు పెట్టారు. అలాగే, అమెరికాలోని ఆడమ్స్ కౌంటీలో కూడా 1857లో న్యూయర్క్ నుంచి వలస వచ్చినవారు స్థాపించిన ‘ఫ్రెండ్‌షిప్’ అనే మరో గ్రామం ఉంది. దీనిని అందరూ కలిసికట్టుగా ఉండాలనే ఆలోచన తమ సొంత ఊరి పేరునే ఫ్రెండ్‌షిప్ పేరు పెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Leave a Comment