ఆరోజు నా చేత అతను లగేజ్ మోయించాడు..ఏడుపు వచ్చేసింది

Rajinikanth Speech at Coolie Event: సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ'(Coolie Movie) ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నిన్న చెన్నై లో ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ కి మూవీ లో నటించిన నటీనటులతో పాటు, సాంకేతిక నిపుణులు మరియు ఇతర టెక్నీషియన్స్ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేసిన అమీర్ ఖాన్ సినిమాలోని తన గెటప్ తో ఈవెంట్ కి రావడం హైలైట్ గా మారింది. ప్రతీ ఈవెంట్ లో లాగానే ఈ ఈవెంట్ లో కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ అద్భుతమైన ప్రసంగాన్ని అందించాడు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

తన జీవితం లో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన గురించి రజనీకాంత్ మాట్లాడుతూ ‘ఒకరోజు నేను రోడ్డు మీద ఖాళీగా నిల్చున్నాను. అప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి నా లగేజ్ ని టెంపో వరకు తీసుకెళ్తావా అని అడిగాడు. నేను సరే అని అతని టెంపో వరకు తీసుకొచ్చాను. ఆ తర్వాత అతన్ని బాగా పరిశీలించి చూస్తే ఇతన్ని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుందే, ఓహో ఇతను నేను చదువుకున్న కళాశాలలో క్లాస్ మేట్ అని తర్వాత అర్థమైంది. కాలేజీ రోజుల్లో నేను అతన్ని సరదాగా ఆటపట్టించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే లగేజ్ ని నేను అతని టెంపో వద్దకు తీసుకెళ్లిన తర్వాత నా చేతిలో రెండు రూపాయిలు పెట్టి అతను ఒక మాట అన్నాడు. ఆరోజుల్లో నీకున్న అహంకారం ఎవరికీ ఉండేది కాదు, అప్పట్లో ఎలా ఉండేవాడివో నీకు గుర్తుందా? అని అడిగాడు. అతను మాట్లాడిన ఆ మాటలకు నా కంట్లో నీళ్లు ఆగలేదు, జీవితం లో నేను అత్యంత బాధపడిన సందర్భం అదే’ అంటూ చెప్పుకొచ్చాడు రజనీకాంత్.

అదే విధంగా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గురించి మాట్లాడుతూ ‘పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ లు సాధించి, తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న లోకేష్ కనకరాజ్ తో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ సినిమాకు ఇంత క్రేజ్ రావడానికి కారణం ఆయనే. అంచనాలను ఆయన పతాకస్థాయికి తీసుకెళ్లాడు. ఈ కథ చెప్పడానికి లోకేష్ నా దగ్గరకి వచ్చినప్పుడు ముందు గా అతను నాకు చెప్పినది, సార్ నేను కమల్ ఫ్యాన్ ని అని అన్నాడు. అది నేను నిన్ను అడిగానా? అని అనగా, ఎందుకో చెప్పాలని అనిపించింది సార్ అని అన్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు రజనీకాంత్. త్వరలోనే తెలుగు లో కూడా ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయబోతున్నారు మేకర్స్.

Leave a Comment