Visakhapatnam Steel Privatization Controversy: విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ.. గుట్టు విప్పేసిన కేంద్రం!

Visakhapatnam Steel Privatization Controversy: విశాఖ స్టీల్( Visakha steel plant ) ప్రైవేటీకరణకు సంబంధించి అదే అస్పష్టత కొనసాగుతోంది. ఒకవైపు ప్రైవేటీకరణ చేయమని చెబుతూనే.. పెట్టుబడులు ఉపసంహరించుకుంటామనే సంకేతాలు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఒకవైపు విశాఖ స్టీల్ ఉత్పత్తి పెంచేందుకు గాను భారీగా ఆర్థిక సాయం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ప్రైవేటీకరణ ఉండదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ చట్టసభల్లో మాత్రం ప్రైవేటీకరణ తప్ప మరో గత్యంతరం లేదన్నట్లు మాట్లాడుతోంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం కూడా అసాధ్యమని చెబుతోంది. ఒకవైపు రాష్ట్రానికి వస్తున్న కేంద్ర ప్రతినిధులు ప్రైవేటీకరణ ఉండదని చెబుతున్నారు. పార్లమెంటుకు వచ్చేసరికి భిన్న ప్రకటనలు చేస్తున్నారు. దీంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగ కార్మికులు. అయితే కేంద్ర ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తుండడం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. ఏదైనా నిర్ణయం కరెక్ట్ గా ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Also Read: విశాఖలో 53 వేల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు!

వెనక్కి తగ్గమని సంకేతాలు..
అయితే తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి.. తాము వెనక్కి తగ్గే యోచనలో లేమని విషయాన్ని స్పష్టం చేసింది కేంద్రం. 100% పెట్టుబడుల ఉపసంహరణ ఉంటుందన్న క్యాబినెట్( cabinet) నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి వెల్లడించింది. ఏపీకి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు అడిగిన ప్రశ్నలకు గాను కేంద్ర ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.’ విశాఖ స్టీల్ ప్లాంట్లో 100% పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేసే ప్రతిపాదన లేదు. ఇప్పటివరకు ప్లాంట్లో 1017 మంది ఉద్యోగులు టిఆర్ఎస్ కు దరఖాస్తు చేశారు. అదే సమయంలో కేంద్రం అందించే 11 వేల కోట్ల సాయానికి సంబంధించి ఇప్పటివరకు రూ.984 కోట్లు విడుదల చేసినట్లు కూడా మంత్రి తెలిపారు. ఒకవైపు సెయిల్ లో విలీనం లేదని చెబుతున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ తప్పదని తేల్చేశారు.

Also Read: దేశంలో ఏపీకి మూడో స్థానం

గత కొన్నేళ్లుగా వివాదం..
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశం గత కొన్నేళ్లుగా కుదిపేస్తోంది. కేంద్రం నుంచి అనేక రకాల ప్రతిపాదనలు కూడా వచ్చాయి. ప్రైవేటీకరణ అంశం బయటకు వచ్చిన నాటి నుంచి కార్మికులతో పాటు ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఉత్తరాంధ్ర ప్రజల నుంచి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయింది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో( Steel Authority of India Limited ) విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్రం లీకులు ఇచ్చింది. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడ సాధించాలంటే సెయిల్ లో విలీనం చేస్తే మంచిదనే ఆలోచనకు వచ్చింది. అయితే అటువంటి ప్రక్రియ ఏమీ జరగలేదు. 11 వేల కోట్ల రూపాయలకు పైగా సాయం ప్రకటించినా.. ఇప్పటివరకు 1000 కోట్లు కూడా మంజూరు చేయలేదు. మరోవైపు విశాఖ స్టీల్ నష్టాల బారి నుంచి బయటపడేందుకు స్టీల్ ప్లాంట్ కు చెందిన 1500 నుంచి 2000 ఎకరాల భూములను ఎన్ ఎం డి సి కి విక్రయించే ప్రతిపాదనలు, బ్యాంకు రుణాల వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని గతంలో నిర్ణయించగా.. అప్పటినుంచి ఇప్పటివరకు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ సభ్యులు ప్రశ్నించడం.. సంబంధిత మంత్రి సమాధానాలు ఇవ్వడం చూస్తుంటే మాత్రం.. పలు అనుమానాలకు తావిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Leave a Comment