Rajamouli Vs Aamir Khan controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి(Rajamouli)…ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాను తనకి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టినవే కావడం విశేషం…యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయన సృష్టించిన ప్రభంజనం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన ఆయన త్రిబుల్ ఆర్ సినిమాతో చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు చేస్తున్న సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఆయన చేస్తున్న ఈ సినిమాతో తనకి ఎలాంటి విజయం వరిస్తోంది. ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక రాజమౌళి తో సినిమాలు చేయడానికి చాలామంది హీరోలు ఆసక్తి చూపిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఆయన సినిమాలో చిన్న క్యారెక్టర్ ఉన్నా కూడా చేస్తామంటూ ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరు వెంటపడుతున్నారు. కానీ రాజమౌళి మాత్రం తన సినిమాకి ఎవరైతే అవసరమో వాళ్ళను మాత్రమే తీసుకుంటాడు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అయిన అమీర్ ఖాన్ సైతం రాజమౌళి సినిమాలో నటించడానికి తీవ్రమైన ఆసక్తిని చూపిస్తున్నాడు… కానీ రాజమౌళి మాత్రం అమీర్ ఖాన్ ను పట్టించుకోవడం లేదు. ఎందుకంటే రాజమౌళి వాళ్ళ నాన్న అయిన విజయేంద్రప్రసాద్ ‘భజరంగీ భాయిజాన్’ కథని ముందుగా అమీర్ ఖాన్ కి వినిపిస్తే ఆ స్క్రిప్ట్ కి గాను విజయేంద్ర ప్రసాద్ రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయగా, అమీర్ ఖాన్ మాత్రం కేవలం 10 లక్షలు మాత్రమే ఇస్తామని చెప్పారట. దాంతో విజయేంద్రప్రసాద్ కి చాలా వరకు అవమానంగా అనిపించిందట. అందుకే ఆయన అమీర్ ఖాన్ కాదని సల్మాన్ ఖాన్ కి ఆ కథను వినిపించి ఆయన చేత సినిమా చేయించి సూపర్ సక్సెస్ ని అందించాడు. ఇక అప్పటినుంచి ఈ విషయాన్ని తెలుసుకున్న రాజమౌళి కి అమీర్ ఖాన్ మీద కొంత వరకు కోపం అయితే ఉందని అందుకే అతనితో సినిమా చేయలేకపోతున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళి తన సినిమాలో ఎవర్ని తీసుకున్నప్పటికి అమీర్ ఖాన్ ని మాత్రం తీసుకునే ప్రసక్తి లేదని రాజమౌళి పలు సందర్భాల్లో ఆయన సన్నిహితుల దగ్గర తెలియజేసినట్టుగా కూడా కొన్ని వార్తలైతే బయటికి వచ్చాయి… ఇక ఫ్యూచర్ లో కూడా అమీర్ ఖాన్ తో సినిమా చేసే అవకాశాలైతే లేవనే చెప్పాలి…
Also Read: ‘కింగ్డమ్’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఇంకా ‘హిట్ 3’ డే1 వసూళ్లను దాటలేదు!