Moringa Leaves: శాస్త్రవేత్తల అపురూప సృష్టి.. మునగాకుతో ఆవుకు సూపర్ ఫుడ్.. కిలో రూ. 2 కే దాణా – Telugu News | Moringa Leaf Feed Boosts Milk Yield: Jhansi Scientists’ Breakthrough

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ గ్రాస్‌ల్యాండ్, ఫాడర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు పశువులను ఆరోగ్యంగా ఉంచి.. పాల ఉత్పత్తిని అద్భుతంగా పెంచే దేశీ ఫార్ములాను అభివృద్ధి చేశారు. ఈ ఫార్ములా ప్రత్యేకత ఏమిటంటే ఖరీదైన సప్లిమెంట్ ఆధారంగా తయారు చేసింది కాదు. భారతీయులు అద్భుతమైన ఔషధగుణాలు ఉన్న మొక్క మునగ అని భావిస్తారో దానిని నుంచి తయారు చేశారు. మునగాకు ఆకులను, కాండాలను కత్తిరించి ఎండబెట్టి.. ఆ పొడి నుంచి ఆవులకు ఆహారాన్ని తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

మునగాకుతో చేసిన పొడిని పశువులు తినే ఆహారంలో చేర్చినప్పుడు ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. పాల ఉత్పత్తి 20 నుంచి 25 శాతం పెరిగింది. అలాగే ఆవుల శరీరంలో ప్రోటీన్, జింక్, ఫైబర్ పరిమాణంలో గణనీయమైన పెరుగుదల కనిపించిందని చెప్పారు. ఈ స్వదేశీ ఫార్ముల అతిపెద్ద లక్షణం దీని ధర. మన దేశంలో సాధారణంగా పశువుల దాణా కిలోకు 10 నుంచి 15 రూపాయలు ఖర్చవుతుంది. అయితే ఇప్పుడు ఈ మునగ ఆకుతో పశువులకు దాణా కిలోకు కేవలం 2 రూపాయల ఖర్చుతోనే తయారు చేయవచ్చు. ఇలా ఖర్చు తక్కువ కావడం వలన పాల ఉత్పత్తిదారులకు లాభదాయకంగా ఉండటమే కాదు..ఆర్థికంగా కూడా చాలా ప్రయోజనకంరంగా ఉంటుంది.

అన్ని సీజన్లకు అనువైన రెడీమేడ్ ఫీడ్

ఇవి కూడా చదవండి

మునగాకుని ఇప్పటివరకు ఆకు కూరలు లేదా ఔషధంగా మాత్రమే భావించేవారు. అయితే ఇక నుంచి ఇది పశుగ్రాసానికి సూపర్‌ఫుడ్‌గా మారింది. శాస్త్రవేత్తల ప్రకారం దీని ఆకులలో నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి, అరటిపండ్ల కంటే ఎక్కువ పొటాషియం, పాలు, గుడ్ల కంటే ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉన్నాయి. ఈ మునగాకులో దాదాపు 21.53 శాతం ముడి ప్రోటీన్, 24.07 శాతం యాసిడ్ డిటర్జెంట్ ఫైబర్ మరియు 17.55 శాతం న్యూట్రల్ డిటర్జెంట్ ఫైబర్ ఉన్నాయి. దీనికి ఉన్న మరొక గొప్ప గుణం ఏమిటంటే.. ఈ మునగ చెట్టు కరువు పరిస్థితులలో కూడా సులభంగా పెరుగుతుంది. తక్కువ నీరు ఉన్న భూమిలో కూడా ఈ మొక్కను పెంచవచ్చు.

కోసిన వెంటనే ఆకులు పెరగడం మొదలు
మునగ చెట్లను 50-50 లేదా 30-30 సెం.మీ దూరంలో నాటితే.. తక్కువ సమయంలోనే సమృద్ధిగా ఆకులు దిగుబడి వస్తుందని, ఎండిన తర్వాత ఆ ఆకులను ఆహారంగా మార్చవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. బుందేల్‌ఖండ్ ఆర్థిక వ్యవస్థలో పాల ఆధారిత మార్పు తీసుకురావడానికి ఈ ఆవిష్కరణను ఆచరణలో పెట్టమని ఇప్పుడు శాస్త్రవేత్తలు పశువుల పెంపకందారులను ప్రోత్సహిస్తున్నారు. ఝాన్సీ నుంచి ప్రారంభమైన ఈ ప్రయోగం ఇప్పుడు మొత్తం దేశానికి కొత్త ఆశాకిరణంగా ఉద్భవిస్తోంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి..

Leave a Comment