Balakrishna Mass Hero Movies: బాలయ్య చేసిన ఆ ఒక్క సినిమా

Balakrishna Mass Hero Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆ ఫాం లీ నుంచి ఏ హీరో వచ్చిన కూడా మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా బాలకృష్ణ మాత్రం ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉండేలా చూసుకుంటున్నాడు. ఇప్పటికే ఆయన సినిమాలకు మంచి ఆదరణ అయితే లభిస్తుంది…యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికి దక్కనటువంటి గొప్ప గుర్తింపు సంపాదించుకున్న నటుడు కూడా బాలయ్య బాబే కావడం విశేషం…పలు వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆయన తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…ఇక తన కెరియర్ స్టార్టింగ్ లో చేసిన మంగమ్మ గారి మనవడు సినిమా అతన్ని మాస్ హీరోగా నిలబెట్టింది. అప్పటినుంచి వరుసగా మాస్ సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ఆయన కీలక పాత్ర వహిస్తూ వస్తున్నాడు. మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక మంగమ్మ గారి మనవడు సినిమాతో మాస్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్, అఖండ లాంటి ఎన్నో బ్లాక్బస్టర్ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు…

Also Read: రాజమౌళి వాళ్ల నాన్నను అవమానించిన స్టార్ హీరో…అందుకే జక్కన్న ఆ హీరోతో సినిమా చేయడం లేదా..?

రీసెంట్ గా వరుసగా నాలుగు వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న బాలయ్య ఇప్పుడు బోయపాటితో చేస్తున్న ‘అఖండ 2’ సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

కాబట్టి ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని ప్రేక్షకులు భారీ నమ్మకంతో ఉన్నారు… ఇక బాలయ్య బాబు అభిమానులైతే ఈ సినిమాతో ఇండస్ట్రీలో భారీ విజయాలను నెలకొల్పబోతున్నాం అంటూ ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ ఉండడం విశేషం…

Also Read:  పవన్ కళ్యాణ్ – సుకుమార్ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?

మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా వాళ్లకు మంచి క్రేజ్ ను తీసుకొచ్చి పెడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక బాలయ్య బాబు చేసిన భగవంత్ కేసరి సినిమాకు నేషనల్ అవార్డ్ రావడం కూడా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…

Leave a Comment