Anchor Anasuya Mall Incident Viral Video: యాంకర్ అనసూయ(Anchor Anasuya Bharadwaj) బుల్లితెరపై,వెండితెరపై ఎలా కనిపించినా, నిజ జీవితం లో మాత్రం చాలా బోల్డ్ గా ఉంటుంది. ఆమెని ఒక్క మాట అన్నా తీసుకోదు, తనని అన్నవారిపై పదింతలు ఎక్కువ రియాక్షన్ ఇస్తూ ఉంటుంది. ఆంటీ అని కొంతమంది నెటిజెన్స్ పిలిచినందుకు వారిపై పోలీస్ స్టేషన్ లో కేసులు ఫిర్యాదు చేయించిన స్వభావం ఆమెది. అంతటి ఫైర్ యాటిట్యూడ్ ని మనం సినీ సెలబ్రిటీలలో చాలా తక్కువమందిలో చూసి ఉంటాము. ఆ తక్కువ మందిలో ఒకరు యాంకర్ అనసూయ. అందుకే ఆమెని అభిమానించే వాళ్ళు ఎక్కువే, ద్వేషించే వాళ్ళు కూడా ఎక్కువే. అయితే ఈమధ్య కాలం లో యాంకర్ అనసూయ ఎక్కువగా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ లో కనిపిస్తూ ఉంది. రీసెంట్ గానే నెల్లూరు లో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వచ్చిన అనసూయ, ఈరోజు మార్కాపురం లో మరో షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వచ్చింది.
‘చెప్పు తెగుద్ది’.. అనసూయ వార్నింగ్
కొందరు పోకిరీలకు యాంకర్ అనసూయ ‘చెప్పు తెగుద్ది’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ఈ ఘటన జరిగింది. ఆమె మాట్లాడుతుండగా కొందరు యువకులు అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో ఫైర్ అయ్యారు. ‘చెప్పు తెగుద్ది.. ఇంట్లో… pic.twitter.com/PVS6v3Oiwi
— ChotaNews App (@ChotaNewsApp) August 2, 2025
అక్కడ కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. షాపింగ్ మాల్ ఓపెనింగ్ తర్వాత బయటకు వచ్చి సెలబ్రిటీలు కొన్ని మాటలు మైక్ లో మాట్లాడుతూ ఉంటారు కదా, అలా అనసూయ కూడా మాట్లాడేందుకు బయటకు వచ్చింది. ఆమె మాట్లాడుతుండగా కొందరు ఆకతాయిలు అనసూయ ని ఉద్దేశించి కొన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడారు. అవి ఆమె చెవిన పడడంతో ‘చెప్పు తెగుద్ది..ఇక్కడ ఎంత మంది ఉన్నారని కూడా చూడను, నేరుగా క్రిందకు వచ్చే చెప్పుతో కొట్టేస్తాను. మీ ఇంట్లో అమ్మా, చెల్లి ని ఇలాగే ఏడిపిస్తే మీరు ఊరుకుంటారా?, పెద్దవాళ్ళను ఎలా గౌరవించాలో మీ ఇంట్లో అమ్మానాన్నలు నేర్పించలేదా’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆమెని ఆ ఆకతాయిలు ఎలాంటి మాటలు మాట్లాడారో తెలియదు. కానీ కచ్చితంగా ఆమె ట్రిగ్గర్ అయ్యే మాటలే మాట్లాడి ఉంటారని అనుకోవచ్చు.
Also Read: బాలయ్య చేసిన ఆ ఒక్క సినిమా ఆయన్ని మాస్ హీరోగా నిలబెట్టిందా..?
అనసూయ కి ఆంటీ అనే పదం అసలు నచ్చదు. వక్రబుద్ధితో ఆలోచించే కొంతమంది కావాలని ఈ పాదంతో పిలుస్తుంటారు అనేది ఆమె వాదన. బహుశా అక్కడికి వచ్చిన వాళ్ళు ఇలాగే ఎగతాళి చేసి ఉంటారు. అందుకే ఆమె అంత ఫైర్ అయ్యింది. ఇకపోతే ఒకప్పుడు బుల్లితెర పై యాంకర్ గా క్షణం తీరిక లేకుండా గడుపుతూ వచ్చిన అనసూయ, ఇప్పుడు సినీ నటిగా పాన్ ఇండియా లెవెల్ లో అన్ని రకాల పాత్రలు పోషిస్తూ కోట్ల రూపాయిలు సంపాదించే ఆర్టిస్టులలో ఒకరిగా నిల్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. రీసెంట్ గా ఈమె ‘హరి హర వీరమల్లు’ చిత్రం లో కూడా కనిపించింది. ఇక పోతే నేను అనసూయ వార్నింగ్ ఇచ్చిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము.చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి.