వార్ 2′ మొట్టమొదటి రివ్యూ..ఇలా ఉంటుంద- OkTelugu

War 2 Movie Review: ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం ‘వార్ 2′(War 2 Movie) ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ అభిమానుల కోసం ఈ సినిమా ట్రైలర్ ని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోని కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో స్క్రీనింగ్ చేశారు. సినిమా విడుదలైతే ఎలాంటి హంగామా ఉంటుందో, అంతకు మించిన హంగామా ని ఎన్టీఆర్ అభిమానులు ట్రైలర్ కే చూపించారు. బాలీవుడ్ లో ఇలా హీరోలను ఆరాధించే సంస్కృతి లేదు కాబట్టి, అక్కడ ఈ స్థాయిలో హృతిక్ రోషన్ కి సెలబ్రేషన్స్ జరగలేదు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన మొదటి కాపీ ని రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్మాత నాగవంశీ కొంతమంది బయ్యర్స్ కి వేసి చూపించాడు.

Also Read: ‘ఓజీ’ పాట లో ఇది గమనించారా..థియేటర్స్ లో శవాలు లేచేలా ఉన్నాయి!

వాళ్ళ నుండి ఈ సినిమాకు వచ్చిన టాక్, ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ మధ్య క్యాట్ & మౌస్ గేమ్ లాగా ఉంటుందట. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో ఇద్దరి మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు అభిమనులకు, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని అంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ వేరే లెవెల్ లో ఉంటుందని, అది ఆడియన్స్ కి నచ్చితే సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుందని అంటున్నారు. కానీ స్టోరీ మాత్రం రొటీన్ స్పై యాక్షన్ సినిమాలకు ఉన్న విధంగానే ఉంటుందట. కానీ ఇద్దరి హీరోల మధ్య నువ్వా నేనా అనే రేంజ్ పోటీ చూసే ఆడియన్స్ కి ఆసక్తిని కలిగించే అంశం.

Also Read: హరి హర వీరమల్లు’పై ‘కింగ్డమ్’ ఎఫెక్ట్..9వ రోజు ఎంత వచ్చిందంటే!

అది కాసేపు పక్కన పెడితే ఈ సినిమా విడుదలైన రోజునే రజనీకాంత్ కూలీ కూడా విడుదల కాబోతుంది. ఈ సినిమా పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో, మూవీ లవర్స్ లో ఉన్న అంచనాలు సాధారణమైనవి కావు. ఆ రేంజ్ ని ‘వార్ 2’ మ్యాచ్ చేయకపోతే కమర్షియల్ గా తెలుగు వెర్షన్ లో పెద్ద డిజాస్టర్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఈ చిత్రం లో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో కనిపించబోతున్నాడు. హృతిక్ రోషన్ కూడా సినిమాలో కాసేపటి వరకు నెగటివ్ షేడ్స్ లోనే కనిపిస్తాడట. వీళ్లిద్దరు ఎందుకు అలా మారారు అనేది ఆసక్తికరమైన పాయింట్. ఇక ఈ సినిమాకి అది పెద్ద ప్లస్ ఏదైనా ఉందా అంటే అది కియారా అద్వానీ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. టీజర్ మరియు ట్రైలర్ లో ఆమె బికినీ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది.

Leave a Comment