దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ దిగ్గజ ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ సంస్థ టెస్లా (Tesla)కు భారీ జరిమానా పడింది. ఆటోపైలట్ వ్యవస్థతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి (Road Accident) బాధ్యత వహిస్తూ దాదాపు రూ.2100 కోట్లు బాధితులకు చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. 2019లో అమెరికాలోని ఫ్లోరిడాలో టెస్లా కారులోని ఆటోపైలట్ కారణంగా రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 22 ఏళ్ల యువతి మృతిచెందగా.. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై ఫ్లోరిడాలోని మియామీ ఫెడరల్ కోర్టు విచారణ చేపట్టింది. తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు.. ఆటోపైలట్ వ్యవస్థతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి టెస్లానే బాధ్యత వహించాల్సిందని తేల్చింది. దీనిపై సుదీర్ఘ విచారణ తర్వాత తాజాగా ఫ్లోరిడా కోర్టు తీర్పు వెలువరించింది. టెస్లా 240 మిలియన్ డాలర్లు (దాదాపు 2,100 కోట్లు) పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది.
జార్జ్ మెక్‌గీ అనే వ్యక్తి అనే వ్యక్తి తన టెస్లా కారులో వెళ్తూ అధునాతన ఆటోపైలట్ ఫీచర్‌ను ఉపయోగించాడు. ఎలాగూ కారు ఆటోపైలట్ మోడ్‌లోనే ఉందని భావించిన అతడు 62 mph వేగంతో వెళ్లాడు. అయితే, మార్గమధ్యలో స్టాప్ సైన్, ఫ్లాషింగ్ లైట్స్ దాటి, టీ-జంక్షన్‌లోకి వెళ్లి ప్రమాదం చేశాడు. దీనికి జార్డజ్ కోర్టులో సమధానమిస్తూ.. ‘నేను టెక్నాలజీపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాను. కారుకి ఎదుట ఏమన్నా కనబడితే బ్రేక్ వేస్తుందని అనుకున్నాను’ అని అన్నాడు. దీంతో కోర్టు డ్రైవర్ నిర్లక్ష్యంగా ఉండటం నిజమే అయినా, టెస్లా ఆటోపైలట్ వ్యవస్థ కూడా పని చేయకపోవడమే ప్రమాదానికి కారణమని.. ఇందులో డ్రైవర్‌ను 67% బాధ్యుడిగా, టెస్లాను 33% బాధ్యుడిగా కోర్టు పేర్కొంది. ఈ ప్రమాదానికి గానూ బాధితుల కుటుంబాలకు 329 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇందులో మూడోవంతు టెస్లా చెల్లించనుంది.