ముంబయిః ఫోన్‌పే శుక్రవారంనాడు సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా భారతదేశ మర్చంట్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడానికి రూపొందించిన వ్యూహాత్మక ప్రయత్నం అయిన ‘ఆఫ్‌లైన్ భాగస్వామి కార్యక్రమం’ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) బిల్లింగ్ సాఫ్ట్వేర్, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ) సాఫ్ట్వేర్, వెండిరగ్ మెషీన్లు, అలానే సెల్ఫ్-సర్వింగ్ కియోస్క్‌లను అందించే వారితో సహా సర్వీస్ ప్రొవైడర్లకు, వారి క్లయింట్లను ఫోన్‌పే ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్‌కు రెఫర్ చేయడానికి, అలానే కస్టమైజ్ చేసిన కమీషన్లను సంపాదించడానికి వీలు కల్పిస్తుంది. ఒక ప్రోగ్రామ్‌లో భాగస్వాములైన సర్వీస్ ప్రొవైడర్లు తమ వ్యాపారులకు (క్లయింట్లకు) సమగ్రమైన బిల్లింగ్, ఇంటిగ్రేటెడ్ పేమెంట్స్ సొల్యూషన్స్‌ను అందించగలరు. దీని ద్వారా వారు వ్యాపారుల వృద్ధిలో భాగస్వాములుగా, వారి వ్యాపార అవసరాలను అర్థం చేసుకునేవారిగా గుర్తింపు పొందుతారు. ఈ భాగస్వామ్యం వ్యాపారులకు పేమెంట్ మేనేజ్మెంట్ను సులభతరం చేసి, రోజువారీ స్టోర్ కార్యకలాపాలను మరింత సులభతరం చేస్తుంది.
