పురోహితులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ అనుమతి లేకుండా దేశ, విదేశాలు, అంతర్ రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో దేవాదాయ శాఖ పురోహితులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన కూడదని ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే ప్రత్యేక పూజలు, హోమాలు, శుభ కార్యాలలో దేవాదాయ శాఖకు చెందిన పురోహితులు, అర్చకులు, వేద పండితులు దూరంగా ఉండాలని సూచనలు చేసింది. స్వామి వార్ల పేరు ప్రతిష్టలు విశ్వ వ్యాప్తం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం, అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొనాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Comment