Pawan Kalyan Sukumar Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే… ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి నటులు చాలామంది చాలా రకాల సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ముందుకు సాగుతున్నాడు. కాబట్టి సినిమాలు చేసే అవకాశాలైతే చాలా తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. అందుకే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలను రిలీజ్ చేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి ఒక గుర్తింపును సంపాదించి పెట్టారు. మరి ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికి ఆయన చేసిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయినప్పటికి డివైడ్ టాక్ తో ముందుకు సాగుతోంది. ఇక ఓజీ సినిమా సెప్టెంబర్ 25 వ తేదీన రిలీజ్ అవుతుంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ ఇకమీదట సినిమాలు చేయలేకపోతున్నాడు.
Also Read: ‘కింగ్డమ్’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఇంకా ‘హిట్ 3’ డే1 వసూళ్లను దాటలేదు!
కాబట్టి ఈ సినిమాలను భారీ రేంజ్ లో రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ లని సాధించేలా ప్రణాళికల రూపొందించాలని సినిమా మేకర్స్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు…ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయాలని చాలా మంది దర్శకులు ఆసక్తి చూపించేవారు. అందులో సుకుమార్ ఒకరు. ప్రస్తుతం సుకుమార్ స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతున్నాడు.
పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియాలో ఉన్న రికార్డులను బ్రేక్ చేసి స్టార్ డైరెక్టర్ గా వెలుగొందాడు. ఆయన పవన్ కళ్యాణ్ తో కనక సినిమా చేసి ఉంటే మరింత ముందుకు వెళ్లేవాడని టాప్ డైరెక్టర్ లిస్టులో ఎప్పుడో చేరిపోయేవాడని చాలామంది చెబుతూ ఉంటారు. ఇక సుకుమార్ అప్పట్లో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి ఆయనకు కథను కూడా వినిపించాడు.
Also Read: ‘కూలీ’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి.. ఇలాంటి టాక్ వచ్చిందేంటి..? ఊహించలేదుగా!
కానీ అనుకోని కారణాల వల్ల సినిమా వర్కౌట్ అయితే కాలేదని ఒక ఇంటర్వ్యూలు తెలియజేశాడు. మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది కొంతమందికి మాత్రమే దక్కుతోంది. ఇప్పుడు ఆయనతో సినిమా చేసే అవకాశం ఏ స్టార్ డైరెక్టర్ లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఫోకస్ మొత్తం రాజకీయాల మీద పెట్టాడు. కాబట్టి ఆయన సినిమాలు చేయడం తగ్గించబోతున్నాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది…
[