గుడ్‌న్యూస్.. కేవలం రూ.1 ఎక్స్‌ట్రా చెల్లిస్తే చాలు అదనంగా 14GB డేటా

దిశ, వెబ్ డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థల్లో ఒకటైన ఎయిర్‌టెల్ (Airtel) తన యూజర్లకు గొప్ప శుభవార్త చెప్పింది. ఈ ప్లాన్‌లో గత ప్లాన్ కన్నా కేవలం రూ.1 ఎక్స్‌ట్రా చెల్లిస్తే అదనంగా 14GB డేటాను పొందవచ్చు. ఈ కొత్త ప్లాన్ దేశంలోని అన్ని టెలికాం సర్కిల్‌లలోని యూజర్లకు అందుబాటులో ఉంది. మరీ ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ గురించి వివరంగా తెలుసుకుందామా.

*ఎయిర్‌టెల్ కొత్త రూ.399 రీఛార్జ్ ప్లాన్ :

ఎయిర్‌టెల్ గతంలో రూ.398 రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో 28 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, భారత్ అంతటా ఫ్రీ నేషనల్ రోమింగ్, రోజువారీ 2GB డేటా, 100 ఫ్రీ SMS వంటి సదుపాయాలను పొందవచ్చు. అలాగే, అన్‌లిమిటెడ్ 5G, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందించింది. ఇక ఇప్పుడు ఈ ప్లాన్‌ను అదనంగా ఒక రూపాయితో కొత్త రూ.399 ప్లాన్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. దీంతో ప్రతి రోజు అదనంగా 512MB డేటాను పొందవచ్చు. అంటే ఒక నెల వ్యవధిలో రూ.1 ఖర్చుతో అదనంగా 14GB డేటా పొందవచ్చు. కాగా, దేశంలో రిలయన్స్ జియో తర్వాత అధిక మంది ఎయిర్‌టెల్‌ను వినియోగిస్తున్నారు.

Leave a Comment