'కింగ్డమ్' 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఇంకా 'హిట్ 3' డే1 వసూళ్లను దాటలేదు!

Kingdom Collection Day 2

Kingdom Collection Day 2: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటించిన ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆన్లైన్ రివ్యూస్ నెగిటివ్ గా రాకుండా చాలా వరకు మ్యానేజ్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా వీక్ గా ఉంది, ఇది సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు చెప్తున్న మాట. అయితే సినిమా విడుదలకు ముందు ప్రమోషనల్ కంటెంట్ ని చూసి ఆడియన్స్ హాలీవుడ్ రేంజ్ సినిమా అని ఫీల్ అయ్యారు. కచ్చితంగా విజయ్ దేవరకొండ ని మరో లెవెల్ కి తీసుకెళ్లే సినిమా అనుకున్నారు. అందుకే అంచనాలు తారాస్థాయి కి చేరుకున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి. కానీ మీడియం రేంజ్ హీరోలలో ఆల్ టైం రికార్డుని నెలకొల్పుతుందని అనుకున్నారు, అది జరగలేదు.

Also Read: బాలకృష్ణ సినిమాకు నేషనల్ అవార్డు..నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సమయం!

మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 38 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. టాక్ వచ్చి ఉండుంటే ఇంకా ఎక్కువ వసూళ్లు వచ్చేవి కానీ విజయ్ బ్యాడ్ లక్. టాక్ ప్రభావం కారణంగా రెండవ రోజు మాస్ సెంటర్స్ లో వసూళ్లు ఊహించిన దానికంటే ఎక్కువ డ్రాప్ అయ్యింది. ఫలితంగా రెండవ రోజు పది కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండు రోజులకు కలిపి 47 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది నాని హిట్ 3 మొదటి రోజు వసూళ్లకంటే తక్కువ. ‘హిట్ 3’ చిత్రానికి మొదటి రోజు దాదాపుగా 50 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఆ సినిమాకు కూడా ఇదే విధంగా డివైడ్ టాక్ వచ్చింది. కానీ నాని మంచి హిట్స్ తో ఊపులో ఉండడం తో ఆ చిత్రాన్ని వీకెండ్ వరకు జనాలు ఎగబడి చూసారు.

కానీ విజయ్ దేవరకొండ పరిస్థితి వేరే. ఆయన గత చిత్రాలను ఒకసారి పరిశీలిస్తే, అన్ని ఫ్లాప్ సినిమాలే. విజయ్ దేవరకొండ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. కానీ రెండవ రోజు నుండి వసూళ్లు రావాలంటే కచ్చితంగా సినిమాకు టాక్ బాగుండాలి, లేదా హీరో కి మామూలు ఆడియన్స్ లో క్రేజ్ అయినా ఉండాలి. విజయ్ దేవరకొండ వరుస ఫ్లాప్స్ తో ఉన్నాడు కాబట్టి ఆయనకు మామూలు ఆడియన్స్ లో ప్రస్తుతానికి క్రేజ్ లేదు. అందుకే టాక్ లేకపోవడం సినిమా క్రాష్ అయ్యింది. మొత్తం మీద రెండు రోజులకు కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది, ఈరోజు, రేపు భారీ వసూళ్లు నమోదు అయితే బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వెళ్లొచ్చు ఈ చిత్రం

Leave a Comment