Jr NTR Dragon Movie: నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కి నటుడిగా చాలా మంచి గుర్తింపైతే లభించింది. నందమూరి ఫ్యామిలీ ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చాలావరకు తీవ్రమైన కసరత్తులను చేస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టినవే కావడం విశేషం…యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి దక్కనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం…ఇక వరుసగా ఏడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించిన ఆయన ఇప్పుడు రాబోతున్న వార్ 2 సినిమాతో ఎనిమిదోవ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న డ్రాగన్ సినిమా విషయంలో కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ కంటే ప్రశాంత్ నీల్ ఈ సినిమా విషయంలో చాలా నమ్మకంతో ఉన్నాడు. ఈ సినిమాని అనుకున్న దాని కంటే భారీ రేంజ్ లో తెరకెక్కించడమే కాకుండా తను అనుకున్న సన్నివేశాలని అనుకున్నట్టుగా తీర్చిదిద్దడం లో కీలకపాత్ర వహిస్తూ వస్తున్నారట. మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట రాబోతున్న సినిమాలన్నీ తనకి గుర్తింపును తీసుకొచ్చేవి కావాలనే ఉద్దేశ్యంతో ఆయన మాస్ సినిమాలను చేస్తూ వస్తున్నాడు. అసలు ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన ఆయన ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమా విషయంలో కూడా అదే రిపీట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు…
Also Read: బాలయ్య చేసిన ఆ ఒక్క సినిమా ఆయన్ని మాస్ హీరోగా నిలబెట్టిందా..?
ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికి దక్కినటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న ఆయన రాబోయే సినిమాల విషయంలో సూపర్ సక్సెస్ లను సాధిస్తే మాత్రం ఆయన పాన్ ఇండియాలో ఉన్న టాప్ డైరెక్టర్ గా మారిపోతాడు… ఇండియాలో ఉన్న చాలా మంది హీరోలు అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న విషయం మనకు తెలిసిందే…
ఆయన మాత్రం సెలెక్టెడ్ గా హీరోలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. డ్రాగన్ సినిమా తర్వాత ఆయన ప్రభాస్ తో ‘సలార్ 2’ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. సలార్ 2 సినిమా విషయంలో ఆయన ఇప్పటికి చాలా క్లారిటీగా ఉన్నాడు. సలార్ సినిమాను మించి ఈ సినిమా ఉండబోతుంది అని ఆయన చాలా నమ్మకంతో ఉన్నాడు.
Also Read: నాగార్జున కోసం నాగేశ్వర రావు ఆ హీరోను తొక్కేసే ప్రయత్నం చేశాడా..?
ఆ విధంగానే ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాడు. అయితే డ్రాగన్ సినిమా విషయంలో ప్రశాంత్ నీల్ కి ఉన్న నమ్మకం ఏంటి? అంటే ఆయన కొన్ని బ్లాగ్స్ ని అయితే సెట్ చేసుకున్నాడట. అవి పెర్ఫెక్ట్ గా పడితే థియేటర్ లో విజిల్స్ పడతాయని చెబుతున్నాడు. ఆ ఎలిమెంట్స్ ఆ ఎపిసోడ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయని ఆయన తన సన్నిహితుల దగ్గర తెలియ చేస్తున్నట్టుగా తెలుస్తోంది…